English | Telugu

డేటింగ్ చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటా!

అఖిల్ సార్థక్ రీసెంట్ గా తన పెళ్లి గురించి ఒక న్యూస్ చెప్పాడు. లేటెస్ట్ గా అఖిల్ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ ద్వారా "ఆస్క్ మీ ఏ క్వశ్చన్ ?' టాస్క్ ని తన ఫాన్స్ కి ఇచ్చాడు. ఇక చాలామంది చాలా ప్రశ్నలు అడిగారు. ఒక నెటిజన్ మాత్రం "ఏ వయసులో పెళ్లి చేసుకుంటే బెటర్" అని అడిగేసరికి అఖిల్ తన మనసులో ఉన్న అసలు విషయాన్ని బయట పెట్టాడు. "పెళ్లికి సరైన సమయం 32 లేదా 33 అని అనుకుంటున్నాను.. నాకు ప్రస్తుతానికి 27 ఏళ్లు.. ఇంకో ఐదేళ్ల వరకు పెళ్లి గురించి అస్సలు ఆలోచించను.. ఇప్పుడు నేను ప్రేమలో లేను.. డేటింగ్ కూడా చేయడం లేదు..ఎలాంటి రిలేషన్ షిప్‌లోనూ లేను.. ఒక వేళ నేను ఎవరితోనైనా రిలేషన్‌లో ఉంటే.. డేటింగ్ చేస్తే.. వాళ్లనే పెళ్లి చేసుకుంటాను.. నేను టైం పాస్‌కు మాత్రం డేటింగ్ చేయను.." అంటూ చెప్పుకొచ్చాడు.

మరో నెటిజన్ కొంటెగా "తేజు ఆర్ మోనాల్..ఇద్దరిలో ఎవరిష్టం" అని అడిగేసరికి "దీపికా పదుకొనె" అని ఆన్సర్ చేసాడు. "బీబీ జోడి జర్నీ ఎలా వుంది.. ఇందులో ఏ జోడి అంటే బాగా ఇష్టం" అని అడిగేసరికి "చాలా బాగుంది.. నా షెడ్యూల్ చాలా టైట్ గా ఉంది.. ఆరు కేజీలు కూడా తగ్గాను...నాకు ఫైమా-సూర్య, అర్జున్ కళ్యాణ్-వాసంతి వీళ్ళ జోడీలంటే చాలా ఇష్టం అని తన ఫాన్స్ అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చాడు అఖిల్. బీబీ జోడిలో తేజుతో కలిసి అఖిల్ మాములుగా రచ్చ చేయడం లేదు. ప్రతీ వారం సోషల్ మీడియాలో వీళ్ళ డాన్స్ హాట్ టాపిక్ గా ఉంటోంది.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.