English | Telugu

మంచానికి దగ్గరుంటే పిల్లలు పుడతారు.. రోహిణికి రష్మీ సలహా!

నెక్స్ట్ వీక్ రాబోయే ఎక్స్ ట్రా జబర్దస్త్ ఫుల్ ఎంటర్టైన్ చేయడానికి రెడీ ఐపోయింది. దానికి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో ఫన్ మాత్రం పీక్స్ లో ఉందని చెప్పొచ్చు. ఈ ఎపిసోడ్ మొత్తానికి రష్మీ వేసిన డైలాగ్ హైలైట్ గా నిలిచింది. ఫస్ట్ స్కిట్ సత్తిపండు-రోహిణి జంటతో స్టార్ట్ అయ్యింది. "మా నాన్న ఫోన్ చేసి పిల్లలు కావాలి పిల్లలు కావాలి" అని ప్లేట్ లో ఉన్నది తింటూ రోహిణి అనేసరికి "ఇలా కంచానికి దగ్గరగా ఉంటే పిల్లలు పుట్టరే.." అని సత్తిపండు ఒక డైలాగ్ వేసేసరికి రష్మీ దానికి కంటిన్యూషన్ గా "మంచానికి దగ్గరుండాలి" అని ఫన్నీగా చెప్పేసింది. దాంతో అందరూ స్టన్ ఐపోయారు. మళ్ళీ సత్తిపండు స్కిట్ లోకి వెళ్ళిపోయి "అల్లు అర్జున్ పుష్ప సినిమాలో చేస్తాడు చూడు.. 1000 రూపాయలకు ఒక పూజ, 5000 వేలకు ఒక పూజ, 10 వేలకు ఒక పూజ అలాంటి పూజలు చేస్తే పిల్లలు పుడతారే" అని అనేసరికి ఖుష్బూ పడీ పడీ నవ్వేసింది.

తర్వాత బులెట్ భాస్కర్ తన టీమ్ తో ఎంట్రీ ఇచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ లో "ఇదేలే తరతరాల చరితం" అనే పాట వస్తుంటే ఇమ్మానుయేల్ మాత్రం వర్షాను ఒక వీల్ చెయిర్ లో కూర్చోబెట్టి తోసుకుంటూ వస్తాడు. రాగానే వర్ష వెనక్కి తిరిగి "అన్నయ్యా" అని పిలిచేసింది. దానికి రష్మీ అవాక్కైపోయి "అన్నయ్యానా.. అయ్యా.." అని జబర్దస్త్ టాపు లేచిపోయేలా గట్టిగా జారీచేసింది. తర్వాత రాకేష్-సుజాత స్కిట్ పర్లేదనిపించింది. స్కిట్ ఎండింగ్ లో ఇద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని ఖుష్బూకు చెప్పింది రష్మీ. దాంతో ఆమె వాళ్ళిద్దరికీ కంగ్రాట్యులేషన్స్ చెప్పింది.