English | Telugu

సౌందర్యను కాకుండా నన్ను తీసుకెళ్లిపోవాల్సింది దేవుడు

ఆమని టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి మూవీస్ లో నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని. "ఆ నలుగురు"లో ఆమె నటన సూపర్ అని చెప్పొచ్చు. అలాంటి ఆమని, సౌందర్య బెస్ట్ ఫ్రెండ్స్..రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో సౌందర్య గురించి తలుచుకుని చాల బాధపడింది. "బెంగళూరులో ఉన్నప్పుడు మా ఇద్దరికీ బాగా కనెక్ట్ అయ్యింది. నా విషయాలు తనకు చెప్పేదాన్ని తన విషయాలు నాకు చెప్పేది. అలా ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాము. తను చాల కష్టపడుతుంది. జగపతి బాబు గారు కలిసినప్పుడల్లా అన్ని విషయాలు అడుగుతారు.

నేను "స్వామి" మూవీ షూటింగ్ లో ఉన్నప్పుడు సౌందర్య చనిపోయిందన్న వార్త తెలిసింది. మొదట నమ్మలేదు కానీ తర్వాత మీనా గారు కూడా చెప్పడంతో నాకు కన్నీళ్లు ఆగలేదు. షూటింగ్ లో ఏడ్చేసాను. డైలాగ్ చెప్పలేకపోయాను. తనను చూడటానికి వెళ్ళలేకపోయాను. టీవీలో ఆ సంఘటన చూస్తేనే చాలా బాధేసింది. ఒక నెల తర్వాత ఇంటికి వెళ్లాను..వాళ్ళ అమ్మగారిని పలకరించాను. అప్పుడు దేవుడు దగ్గర నేను ఏడ్చేసాను. పెళ్ళై సంవత్సరం మాత్రమే అయ్యింది. అలాంటి అమ్మాయిని ఎందుకు అప్పుడే తీసుకెళ్లిపోయావ్..నీకు ప్రాణమే కావాలనుకుంటే తన బదులు నన్ను తీసుకెళ్లొచ్చు కదా అని అడిగాను. తినాల్సిన వయసులో సరిగా తినక సరిగా నిద్ర పోక చాలా మూవీ షూటింగ్స్ తో చాలా కష్టపడింది.

కానీ కొంచెం లైఫ్ ని ఎంజాయ్ చేద్దాం అనుకునే టైంకి దేవుడు అలా తీసుకెళ్లిపోవడం చాలా బాధకలిగించే విషయం. వాళ్ళ అమ్మగారిని ఆ టైములో ఓదార్చే శక్తి కూడా నాకు లేకుండా పోయింది. తాను ఉండి ఉంటే చాలా బాగుండేదని అనిపించింది ఈ విషయం గురించి దేవుడి దగ్గర చాలా ఏడ్చాను " అంటూ చెప్పింది ఆమని.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.