English | Telugu

స్వప్న ఇంట్లో‌ లేదనే నిజం తెలుసుకున్న రాజ్ ఫ్యామిలీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'బ్రహ్మముడి' సీరియల్ ఎపిసోడ్-24 లోకి అడుగుపెట్టింది‌. కాగా సోమవారం నాటి ఎపిసోడ్ లో.. కావ్య తెచ్చిన పిండివంటలను రాజ్ ఫ్యామిలీ ఇష్టపడకపోవడంతో అవి స్వప్న చేసినవని కనకం చెప్తుంది. దాంతో రాజ్ వాటిని తీసుకొని తింటాడు. స్వప్నని చూడడానికి వచ్చిన రాజ్ ఫ్యామిలీ.. "స్వప్నని తీసుకురండి" అని చెప్పి ఎదురుచూస్తుంటారు. ఇక కృష్ణమూర్తి, స్వప్నకి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దాంతో కావ్య, స్వప్నని తీసుకురావడానికి వెళ్తుంది.

మరోవైపు రాహుల్ మాయలో పడిపోయి తను చెప్పే ప్రతీది నమ్ముతూ.. స్వప్న టైం పాస్ చేస్తుంది. "ఒక వేళ నీలాంటి ఏంజెల్ గాని నా లైఫ్ లోకి వస్తే, నేను పెళ్లి అక్కడ చేసుకుంటాను, రిసెప్షన్ అక్కడ చేసుకుంటాను, హనీమూన్ అక్కడ అంటూ స్వప్నని ఇంప్రెస్ చెయ్యడానికి అన్నీ చెప్తుంటాడు. అలా చెప్తుండగా.. రాహుల్ ఐ లవ్ యూ అని చెప్తే ఎగిరి గంతేస్తా అన్నట్లుగా స్వప్న వెయిట్ చేస్తుంటుంది. మరోవైపు స్వప్న కోసం ఎదురుచూస్తున్న రాజ్ ఫ్యామిలీకి కృష్ణమూర్తి స్వప్న ఇంట్లో లేదు అన్న నిజం చెప్తాడు. "ఇంతసేపు మాకు ఎందుకు అబద్ధం చెప్పారు" అని రాజ్ తల్లి కోపంగా అడుగగా.. మీనాక్షి కవర్ చేద్దామని.. "మా పెద్ద అమ్మాయిని మా వాళ్ళు చాలా పద్ధతిగా పెంచారు" అని అనగానే.. మీరు ఒక్కరే కూతురని అన్నారు కదా అని రాజ్ తల్లి అంటుంది. ఆ తర్వాత కనకం కవర్ చేస్తుంది. నాకు ముగ్గురు కూతుళ్లు అయినా ఇంకా ఇద్దరిని అబ్బాయిల్లాగా పెంచాం. ఒకరు లండన్ లో ఇంకొకరు మా వారికి బిజినెస్ లో హెల్ప్ చేస్తుందని కనకం అంటుంది. ఇంకా ఎంతసేపు స్వప్న రావడానికి అని రాజ్ తల్లి చిరాకు పడుతుంది.

రాహుల్, స్వప్నకి సర్ ప్రైజ్ అని గదిలోకి తీసుకెళ్తాడు. స్వప్నని వెతుక్కుంటూ కావ్య వస్తుండగా.. టీవీలో కొత్త జ్యువలరీ డిజైన్ లాంఛ్ ప్రోగ్రామ్ వస్తుంది. ఆ ప్రోగ్రామ్ లో స్వప్నని చూస్తుంది కావ్య. మరో వైపు స్వప్న ఇంకా రాకపోయేసరికి.. నేనే వెళ్ళి తీసుకొస్తానని రాజ్ వెళ్తుండగా.. వద్దని కనకం తనని ఆపుతుంది. ఆ తర్వాత తనే వస్తుందని కనకం చెప్తుంది. రాహుల్ మాయలో పడిన స్వప్న పెళ్ళిచూపులకి వస్తుందా లేదా తెలియాలంటే ఆ తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.