English | Telugu

బిగ్ బాస్ హౌస్‌లోకి అభినయశ్రీ

అభినయశ్రీ.. ఈ పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదూ.. అవును 'ఆర్య' మూవీలో "ఆ అంటే అమలాపురం" అనే సాంగ్ వింటే చాలు అభినయశ్రీ గుర్తొచ్చేస్తుంది. నిన్న‌టి త‌రం శృంగార తార అనూరాధ కుమార్తె అయిన ఈమె చాలా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇంకా స్పెషల్ సాంగ్స్ ద్వారా ఈమె సొంత ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు అభినయశ్రీ పేరు ఎందుకు మళ్ళీ చెప్పుకుంటున్నాం అంటే కొంత కాలంగా ఫామ్ లో లేని, అంతా మరిచిపోయిన ఆమె ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. బిగ్ బాస్ సీజన్ 6 కోసం క్వారంటైన్‌లో ఉన్న 20 మంది కంటెస్టెంట్‌లలో అభినయ శ్రీ కూడాఒకరు అని గ‌ట్టిగా వినిపిస్తోంది.

ఆర్య, శ్వేత నాగు, అత్తిలి సత్తిబాబు, మైఖేల్ మదన కామరాజు, చందమామ వంటి మూవీస్ లో నటించింది అభిన‌య‌శ్రీ‌. ఇక 2014 లో తెలుగులో 'పాండవులు' అనే మూవీలో చివరిసారిగా క‌నిపించింది. ఈమె తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా యాక్ట్ చేసింది. అభినయశ్రీ తమిళ్ లో జూనియర్ సూపర్ డాన్స్, డాన్స్ జోడి డాన్స్ వంటి షోస్ లోహోస్ట్ గా చేసింది.ఇక ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.