English | Telugu

ఎవరికైనా ఎప్పుడైనా సాయం చేశావా?.. ఓంకార్‌పై జ్యోతి మండిపాటు!

ఆట సందీప్ అంటే బుల్లి తెర మీద పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. సందీప్, అతని భార్య జ్యోతి రాజ్‌ ఇద్దరూ కలిసి డాన్స్ వీడియోస్ చేస్తూ సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటారు. డాన్స్ స్టెప్స్ కూడా నేర్పిస్తూ లైం లైట్ లో ఉన్నారు. ఐతే ఇప్పుడు ఓంకార్ ని టార్గెట్ చేస్తూజ్యోతి కొన్ని ప్రశ్నలను సూటిగా సంధించింది. "ఎవరైనా తాను ఎదుగుతూ తన చుట్టుపక్కల వారిని ఎదిగేలా చేయడం మానవత్వం అంటారని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మరి నటుడు, యాంకర్ ఐన ఓంకార్ ఏమన్నా ఇలాంటివి చేశాడా?" అంటూ ఆమె ఓంకార్ మీద మండిపడ్డారు.

'ఆట' షోతో గుర్తింపు తెచ్చుకున్న ఓంకార్ తర్వాత ఎన్నో షోస్ నిర్వహించారు. ఈరోజు రియాలిటీ షోస్ కి డిమాండ్ ఇంతలా పెరిగింది అంటే దానికి కారణం ఓంకార్ అని చెప్పొచ్చు. మొదట జెమినీ మ్యూజిక్ లో వీజేగా కెరీర్ని స్టార్ట్ చేసాడు. తర్వాత ఆట, మాయాద్వీపం, ఛాలెంజ్, ఇష్మార్ట్ జోడి, సిక్స్త్ సెన్స్ వంటి సూపర్ డూపర్ షోస్ తో ఒక రేంజ్ లో ఎదిగి పేరు తెచ్చుకున్నాడు ఓంకార్.ఇప్పుడు ఆహా ఓటిటిలో 'డాన్స్ ఐకాన్' అనే షోకి హోస్ట్ గా కూడా చేస్తున్నాడు. ఇటు సిల్వర్ స్క్రీన్ మీద తానేంటో ప్రూవ్ చేసుకుంటూ బిగ్ స్క్రీన్ వైపు కూడా అడుగులు వేసి జీనియస్, రాజుగారి గది 1, 2 డైరెక్ట్ చేశాడు. నాగార్జునని పెట్టి 'రాజుగారి గది 2' తీసాడంటే ఓంకార్ రేంజ్ ఏంటో ఈపాటికి అర్థ‌మయ్యే ఉంటుంది.

"చాలా రియాలిటీ షోస్ లో గుర్తింపు తెచుకున్నవారికి చాలామంది మంచి అవకాశాలు ఇస్తున్నారు. కానీ ఓంకార్ మాత్రం అలా ఎందుకు ఛాన్సులు ఇవ్వడం లేదు, మంచి డాన్సర్స్ గా గుర్తింపు తెచ్చుకున్నవారిని ఎందుకు పట్టించుకోవడం లేదు?" అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించింది జ్యోతి. అలాగే "ఓంకార్ మూవీస్ తీసేటప్పుడు పెద్ద పెద్ద డాన్స్ మాస్టర్స్ నే ఎందుకు పెట్టుకుంటున్నారు? ఇలాంటి వాళ్ళను, అలాగే మీ తమ్ముళ్లను ఎందుకు ఎంకరేజ్ చేయడం లేదు? వాళ్లకు ఎదిగే అవకాశాన్ని ఎందుకు కల్పించడం లేదు" అని అడిగింది.

"ఒకప్పుడు ఆటలో చేసిన ఒక్క కొరియోగ్రాఫర్ కైనా ఇప్పుడు లైఫ్ ఉందా? లేదు కదా.. వాళ్ళు అవకాశాలు లేక, ఈవెంట్స్ కి ఎవరూ పిలవక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆట షోలో ఒకప్పుడు టాప్ అని పేరు తెచుకున్నవాళ్లంతా ఇప్పుడు కింద పడిపోయారు. వీళ్లల్లో ఎవరినైనా చూసినప్పుడు చాలా బాధగా ఉంటుంది" అంటూ తన మనసులో ఆవేదనని బయటపెట్టింది జ్యోతి. ఈ కామెంట్స్ కి ఓంకార్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Karthika Deepam2: వైరాతో జ్యోత్స్న డీలింగ్.. కార్తీక్ కి డౌట్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -544 లో.....శౌర్యకి దీప భోజనం తినిపిస్తుంది. అది చూసి కొడుకు కోడలితో చెల్లి మాట్లాడుతలేనట్లు ఉందని అనసూయ అంటుంది. వాళ్లే దాక్కొని తిరుగుతున్నారని కాంచన అంటుంది. శౌర్య వెంట భోజనం తినమని దీప పరుగెడుతుంది. శౌర్య అలా అమ్మని పరిగెత్తించవచ్చా.. ఇప్పుడు అమ్మ కడుపులో బేబీ ఉంది కదా తనకి ఆయాసం వస్తుంది ఇకనుండి నువ్వే భోజనం చెయ్యాలని కాంచన అనగానే.. నువ్వు మంచి నానమ్మవి కాదు నిన్ను తాతయ్య దగ్గరికి పంపించాలి.. మా అమ్మ నాకు తినిపించకుండా చేస్తున్నావని శౌర్య అంటుంది.

Illu illalu pillalu: ఇంగ్లీష్ టీచర్ గా శ్రీవల్లి.. ప్రేమ, నర్మద ప్లాన్ సూపర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -345 లో... భాగ్యం, ఆనందరావు ఇద్దరు రామరాజు ఇంటికి శ్రీవల్లి డూప్లికేట్ సర్టిఫికేట్లు తీసుకొని వస్తారు. అవి ప్రేమ చూసి డూప్లికేట్ సర్టిఫికేట్లు అని చెప్పదు. ఇంకేంటి మావయ్య మీరు మీకు తెలిసిన కాలేజీ ప్రిన్సిపల్ కి ఫోన్ చెయ్యండి.. అక్క  ఇంగ్లీష్ టీచర్ గా జాయిన్ చెయ్యండి అని ప్రేమ అంటుంది. రామరాజు ఫోన్ చేస్తుంటే కావాలనే శ్రీవల్లి తుమ్ముతుంది. ఇప్పుడే వద్దు మావయ్య అంటుంది. అయినా రామరాజు వినకుండా ఫోన్ చేసి ప్రిన్సిపల్ తో మాట్లాడతాడు.