English | Telugu

మహిళలు..మహారాణులు...ఉమెన్స్ డే ఎపిసోడ్


వచ్చే ఆదివారం మహిళా దినోత్సవం..ఇక ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుల్లితెర మీద మొత్తం లేడీస్ మాత్రమే ఎక్కువగా కనిపిస్తున్నారు. లేడీ బేస్డ్ షోస్ అన్నీ ఆ రోజు అలరించబోతున్నాయి. ఇక ఇప్పుడు ఆదివారం విత్ స్టార్ మా పరివారం నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక నెక్స్ట్ వీక్ ఉమెన్స్ డే స్పెషల్ గా రాబోతోంది. ఇందులో చాలా మంది బుల్లితెర నటీమణులు వచ్చారు. అలాగే కార్తీక దీపం సీరియల్ లో నటించే చైల్డ్ ఆర్టిస్ట్ చైత్ర లక్ష్మి కూడా వచ్చింది. "హ్యాపీ ఉమెన్స్ డే" అందరికీ అని చెప్పింది.

ఇక శ్రీముఖి ఐతే మీ మీ లైఫ్స్ లో ఇన్స్పిరేషన్ అనే ఎవరని చెప్తారు అంటూ అడిగింది. "నాకు మా అమ్మ ది బెస్ట్ ..ఆడోల్లు మీకు నిజంగానే జోహార్లు " అని ప్రియాంక జైన్ చెప్పింది. తర్వాత జ్యోతక్క వంతు వచ్చింది. "మనం జీవితంలో ఎంత లో ఐనా కూడా స్ట్రాంగ్ గ నిలబడాలి అంటే అమ్మ. అన్ని బంధాలను పట్టుకుని నిలబెట్టింది మా అమ్మ" అని చెప్పింది. "నాకు జన్మ ఇచ్చింది నా తల్లి అంటే ఆ జీవితానికి ఒక అర్ధం ఇచ్చింది నా కూతురు" అంటూ ఫైర్ బ్రాండ్ కస్తూరి చెప్పింది. ఇక ఈ షోకి విష్ణు ప్రియా కూడా వచ్చింది. రీసెంట్ గా తన తల్లిని కోల్పోయింది. ఇక రోహిణి అలాగే సీనియర్ నటీమణులు కూడా వచ్చారు. ఇక విష్ణు ప్రియా కూడ ఈ షోకి వచ్చేసరికి నెటిజన్స్ ఫుల్ ఖుషీ ఐపోతున్నారు. అలాగే కొంతమంది నెటిజన్స్ ఐతే తెచ్చినవారినే కాదు కొత్త కొత్త వాళ్ళు చాలామంది కూడా ఉన్నారుగా వాళ్ళను కూడా తీసుకురండి అంటూ ప్రోమో కింద కామెంట్స్ పెడుతున్నారు.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.