English | Telugu
మగాళ్లు నాపై కన్నేశారు!
Updated : Sep 5, 2022
బిగ్ బాస్ 6వ సీజన్ స్టార్ట్ ఐపోయింది. నాగార్జున మంచి డాన్స్ తో ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత ఒక్కో కంటెస్టెంట్ ఒక్కో స్టయిల్లో వచ్చి వాళ్ళ వాళ్ళ జీవితాల్లో జరిగిన ఎన్నో బాధల్ని చెప్పారు. బిగ్ బాస్ తెలుగు సీజన్6లో హౌస్ లోకి 20వ కంటెస్టెంట్ గా ఆరోహి ఎంట్రీ ఇచ్చింది. "ఒక పల్లెటూరి అమాయకపు ఆడపిల్ల అంజలి నుంచిఆరోహి రావ్ గా ఎలా మారావ్?" అని నాగ్ అడిగేసరికి తన స్టోరీ మొత్తం చెప్పేసింది.
అంజలి పల్లెటూరి ఆడపిల్ల... ఆమెకు కన్న తల్లి లేదు. ఏదైనా సాధించాలనే పట్టుదలతో హైదరాబాద్ లో ఒంటరిగా అడుగుపెట్టింది. "వయసులో ఉన్న ఆడపిల్ల ఇలాంటి ఒక మహానగరంలో అడుగుపెట్టడం, బతకడం ఎంత కష్టమోఅప్పుడు తెలిసొచ్చింది" అని చెప్పింది. మగాళ్లు తనపై కన్నేశారని తెలిపింది. తన చుట్టూ ఉన్న పరిస్థితులు చూసి తనని తాను మార్చుకోవాలని అప్పుడు డిసైడ్ అయ్యింది. ఇంత అమాయకంగా ఉంటే ప్రపంచంలో బతకలేనని తెలుసుకుని కట్టూబొట్టూ మార్చేసుకున్నట్లు చెప్పింది.
మోడరన్ అవతారంలోఅంజలి నుంచిఆరోహిగా మారినట్లు చెప్పింది. బిగ్ బాస్ హౌస్ కి ఎందుకు వచ్చావని నాగార్జున అడిగేసరికి "హౌస్ లో సెలెబ్రిటీలు ఉండొచ్చు. వాళ్ళు ఇప్పటికే జనాలకు తెలిసుండొచ్చు. వాళ్లకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది. నేను మాత్రం ఎవరికీ తెలియదు. కాబట్టి నేనేమిటో నిరూపించుకుని ఓ గుర్తింపు తెచ్చుకుంటానని.. అందుకే హౌస్ లోకి వెళ్తున్నా" అని ఆరోహి చెప్పింది. చివర్లో నాగార్జున కొన్ని ఇంట్రుషన్ కార్డ్స్ తెప్పించారు. అందులో అంజలికి'బ్లాక్ హార్ట్' కార్డు వచ్చింది. అలా ఆరోహి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది.