English | Telugu

'నీకెవడు ఛాన్స్ ఇస్తాడే.. అందంగా లేవు, బాడీ లేదు'.. అనేవారు!

ఫైమా `జ‌బ‌ర్దస్త్` షో ద్వారా మస్త్ పాపులర్ అయ్యింది. అదిరిపోయే పంచ్‌లతో బుల్లెట్‌ భాస్కర్‌తో కలిసి రచ్చ రచ్చ చేస్తుంటుంది. అలాగే సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యింది. ఇక ఇప్పుడు బిగ్‌ బాస్‌ 6 లోకి అడుగుపెట్టింది. "నీ జీవితంలో ఎవరైనా ఉన్నారా?" అని నాగ్ అడిగేసరికితన లవ్‌ స్టోరీ చెప్పి కన్నీళ్లు పెట్టించింది. ఫైమా బిగ్ బాస్ హౌస్ లోకి 16వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది.

తెలంగాణలోని దోమకుంట అనే మారుమూల పల్లెటూరిలో పుట్టింది ఫైమా. తాము నలుగురం అమ్మాయిలమని, కూలీ చేసుకునే కుటుంబం నుంచి వచ్చాన‌నీ చెప్పింది. 35 ఏళ్లుగా కిరాయిఇంట్లో ఉంటున్నామని, ఒక ఇల్లు కట్టుకోవాలని ఆశతో హౌస్ లోకి వచ్చినట్లు చెప్పింది. తన కెరీర్ మూడేళ్ల క్రితం స్టార్ట్ అయ్యిందని.. ఒక ఏడాది కష్టపడేసరికి తర్వాత సక్సెస్‌ రావడం స్టార్ట్ అయ్యిందని చెప్పింది.

"హౌజ్‌లోకి వెళ్లాక తగ్గేదెలే... వందకి వెయ్యి శాతం ఎంటర్టైన్మెంట్ అందిస్తాను" అని చెప్పింది ఫైమా. బిగ్‌ బాస్‌ కిఎలాగైనా వెళ్లాలని ఒకసారి తన ఫ్రెండ్స్ తో అన్నప్పుడు "నీకెవడు ఛాన్స్ ఇస్తాడే.. అందంగా లేవు, బాడీ లేదు" అంటూ ఎగతాళి చేసేవారని, కానీ ఇప్పుడుఇలా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నా అని చెప్పింది.

ఇక ఇదే టైంలో తన జీవితంలో ప్రవీణ్ ఉన్నాడని, తనకు అమ్మ లేదని.. రీసెంట్ గా తండ్రి కూడా పోయాడని, తనని తన కన్నతల్లిలా చూసుకుంటాడని చెప్పింది. అప్పుడే ప్రవీణ్ రాసిన కామెడీ ప్రేమలేఖ ఇచ్చారు నాగ్. లెటర్ మొత్తం ఫన్నీగా రాసినా, చివరిలో కన్నీళ్లు పెట్టించేలా రాసేసరికి ఫైమా స్టేజి మీద కన్నీటిపర్యంతమయ్యింది. అలా ఆమె లవ్‌ స్టోరీ అందరినీ ఎమోషన్ కి గురయ్యేలా చేసింది.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.