English | Telugu

యాక్సిడెంట్ అయ్యాక పేరు మార్చుకున్నా.. దశ తిరిగింది!

'గలాటా' గీతూ రాయల్ గురించి ఇంట్రడక్షన్ అవసరమే లేదు. ఎందుకంటే ఆమె చేసిన ఎన్నో బోల్డ్ వీడియోస్ వైరల్ అయ్యాయి. జబర్దస్త్ లో కూడా ఎంట్రీ ఇచ్చి ఫేమస్ అయ్యింది. బిగ్ బాస్ హౌస్ లోకి 8వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది గీతూ. యూట్యూబర్ గా రివ్యూస్ చేస్తూ, ఆర్టిస్ట్ గా ఫుల్ ఫేమస్ అయ్యింది. అలా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తన యాసతో నాగ్ ని బాగా ఇంప్రెస్ చేసేసింది.

2014లో బొమ్మరిల్లు సినిమాలో ఉన్నట్టు రన్నింగ్ బస్సు నుంచి దిగిపోయింది. కానీ ఆ టైములో రోడ్డు మీద పడిపోయి రక్తం కారుతుంటే అందరూ కలిసి ఫోటోలు తీస్తున్నారని చెప్పింది. ఆ టైమ్‌లో ఒకతను వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లారని వెల్ల‌డించింది.దాదాపు 24 గంటలు కోమాలోనే ఉన్నాన‌ని, మొత్తం 12 కుట్లు పడ్డాయని చెప్పింది. మూడు నెలలు అసలు తనకు ఏం జరిగిందో తెలియదని, తనకుమతిమరుపు ఉందని యటపెట్టింది. ఆ యాక్సిడెంట్ తో తన లైఫ్‌ మొత్తం చేంజ్ ఐపోయిందని, ఆతర్వాత గీతూ రాయల్‌గా పేరు మార్చుకున్నాన‌నీ తెలిపింది.

ఇదే టైములో తన లవ్‌ స్టోరీని కూడా బయటపెట్టింది. చిన్నప్పటినుంచి ఫ్రెండ్‌ ఐన వికాస్ నే మ్యారేజ్ చేసుకున్నట్లు చెప్పింది గీతూ. "నువ్వు ఇమిటేట్ చేస్తావట కదా?" అని నాగ్ అనేసరికి బేబీ వాయిస్‌ లో "అఖిల్ బావ అంటే ఇష్టం. అమల అత్తయ్య అంటే ఇష్టం" అంటూ మాట్లాడి ఇంప్రెస్‌ చేసింది.

తాను ఈ షోకి రావడానికి మూడు కారణాలని తెలిపింది. నిజానికి ఎప్పుడో రావాల్సి ఉంది కానీ సర్జరీ చేయించుకుని సన్నగా మారాక వద్దామనుకుందట కానీ లావు మాత్రం తగ్గడం లేదని చెప్పింది. తన బాడీ అంటే తనకు నచ్చదని చిన్నప్పటినుంచి ఆ అభద్రతాభావం పోగొట్టుకోవడం కోసం హౌస్ లోకి వెళ్తున్నట్లు చెప్పింది. ఒక వేళ టాప్ ఫైవ్ లో ఉంటే గనక ఇదేస్టేజి మీద మూడో కారణం చెప్తానని చెప్పింది గీతూ.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.