English | Telugu
పెళ్లి నుంచి తప్పించుకోవడానికి బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చా!
Updated : Sep 5, 2022
బిగ్ బాస్ హౌస్‌లోకి న్యూస్ యాంకర్, వీజే నేహా చౌదరి ఎంట్రీ అద్దిరిపోయింది. "రారా.. రక్కమ్మ" సాంగ్ కి తాను చేసిన డాన్స్ తో అందరికి తనవైపుకు తిప్పుకుంది. పెళ్లి నుంచి తప్పించుకోవడానికి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చానని, బిగ్ బాస్ తన ఫ్యూచర్ కెరీర్ అని చెప్పింది. "ఎలాంటి అబ్బాయి కావాలి?" అని అడిగేసరికి "కటౌట్ ఎదురుగా ఉంది" అంటూ నాగ్ ని చూపించింది. ఆ ఆన్సర్ కి నవ్వేసాడు నాగ్. తిరుపతిలో పుట్టిన నేహా చౌదరి కంప్యూటర్ సైన్స్ చదివింది. చాలా న్యూస్ చానెల్స్ లో యాంకరింగ్ చేసింది.
తర్వాత స్టార్ స్పోర్ట్స్ తెలుగులో కామెంటేటర్ గా వచ్చిన అవకాశంతో ఫుల్ ఫేమస్ ఐపోయింది. తెలుగులో ఐపియల్ అభిమానులకునేహా చౌదరి బాగా పరిచయం. స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఇచ్చిన ఆమెరిథమిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలో జాతీయ స్థాయి చాంపియన్ గా కూడా నిలిచింది. 2019 సైమా అవార్డ్స్ కి యాంకర్ గా చేసి మంచి గుర్తింపుని తెచ్చుకుంది నేహా.
నేహకు గ్రీకువీరుడు ఎలా ఉంటాడో అనే విషయం గురించి చిన్న టాస్క్ ఇచ్చారునాగ్. రకరకాల కళ్ళు, ముక్కు, మూతి ఇమేజెస్ ఇచ్చి నచ్చినవి తీసి ఒక బోర్డు మీద పెట్టమని చెప్పేసరికి "నా గ్రీకువీరుడిని నేనే తయారు చేసుకుంటున్నాను" అంటూ కొన్ని ఫోటోలు పెట్టింది కానీ ఎక్కడా కూడా గ్రీకువీరుడు రేంజ్ ఫేస్ మాత్రం కనిపించకపోయేసరికి బుర్ర గోక్కుంటూ "ఫేస్ అంతా మిక్స్‌డ్ మసాలా ఐపోయింది" అంది.