English | Telugu

Krishna Mukunda Murari : తను అబార్షన్ చేయించుకోలేదని తెలుసుకున్న కృష్ణ, మురారి.. విషయం తెలిసుకున్న మీరా షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -476 లో.. మీరా గదిలోకి కృష్ణ వెళ్లి చెక్‌ చేస్తుంది. ఎంత వెతికినా ఏం కనిపించదు. మీరాను ఇలాగే వదిలేస్తే ఏం జరుగుతుందోనని భయంగా ఉందని అనుకుంటుంది. మీరా గదిలో ఉన్న డస్ట్ బిన్ చూస్తే అందులో కొన్ని వాడిన ట్యాబ్లెట్స్, పేపర్ కనిపిస్తుంది. ప్రిస్కిప్షన్ చూసి కృష్ణ షాక్‌ అవుతుంది. బేబీ గ్రోత్ కోసం ట్యాబ్లెట్ వేసుకుంటుంది అంటే మీరా అబార్షన్‌ చేయించుకోలేదు. ఎందుకిలా చేస్తుంది. బిడ్డ ఉన్నందుకు సంతోషించాలా.. అబద్ధం చెప్పినందుకు బాధపడాలా అని కృష్ణ అనుకుంటుంది. వాటిని తీసుకుని తన గదికి వచ్చి మనం మోసపోయామని మురారికి చెప్తుంది.

Eto Vellipoyindhi Manasu : ప్రియుడి మోసాన్ని గుర్తించిన భార్య.. భర్తకి దగ్గర అవ్వగలదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -103 లో... అభి మాట్లాడిన మాటలకి రామలక్ష్మి ఏడుస్తూ గుడికి వస్తుంది. అక్కడ కూర్చొని బాధపడుతున్న రామలక్ష్మి దగ్గరకి సీతాకాంత్ వస్తాడు. ఇక అభి అన్న మాటలన్నీ సీతాకాంత్ కి చెప్తుంది రామలక్ష్మి. ఎందుకు అలా మాట్లాడాడో‌.. నేను అడుగుతాను పదా అని సీతాకాంత్ అనగానే.. వద్దు ఇక వాడు నాకు అవసరం లేదు.. నేనే వద్దనుకోని వచ్చాను. ఇకమీదట వాడి గురించి నా ముందు తియ్యకండి అని రామలక్ష్మి  చెప్తుంది. నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది.. వాడి నుండి నిన్ను కాపాడాను. ఇప్పుడు నీ కళ్ళలో నీళ్లు రాకుండా ఇక చూడాలని సీతాకాంత్ అనుకుంటాడు.

Brahmamudi : బాబు తండ్రి రాజ్ అని చెప్పిన మాయ.. షాక్ లో దుగ్గిరాల కుటుంబం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -415 లో....పంతులు గారు తీసుకొని వచ్చిన అక్షింతలు అందరు భర్తలు తీసుకొని తమ భార్యలని ఆశీర్వదిస్తారు. రాజ్ కావ్యని ఆశీర్వదిస్తుండగా.. రాజ్ ఏమైనా ఏకాపత్ని వ్రతుడా అని రుద్రాణి అంటుంది. దాంతో కావ్య స్వప్న ఇద్దరు రుద్రాణికి మంచి కౌంటర్ ఇస్తారు. నా భర్త ఎప్పటికి నాకు శ్రీరామచంద్రుడే అని కావ్య అని రాజ్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. ఆ తర్వాత అనామిక అక్షింతలు తీసుకొని బయట కవితలు రాసుకుంటున్న కళ్యాణ్ దగ్గరికి వస్తుంది. నన్ను ఆశీర్వాదించండి అని అనామిక అనగాన..  కళ్యాణ్ తనని తిట్టి ఆశీర్వదించకుండా వెళ్ళిపోతాడు.