English | Telugu

Krishna Mukunda Murari : తను అబార్షన్ చేయించుకోలేదని తెలుసుకున్న కృష్ణ, మురారి.. విషయం తెలిసుకున్న మీరా షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -476 లో.. మీరా గదిలోకి కృష్ణ వెళ్లి చెక్‌ చేస్తుంది. ఎంత వెతికినా ఏం కనిపించదు. మీరాను ఇలాగే వదిలేస్తే ఏం జరుగుతుందోనని భయంగా ఉందని అనుకుంటుంది. మీరా గదిలో ఉన్న డస్ట్ బిన్ చూస్తే అందులో కొన్ని వాడిన ట్యాబ్లెట్స్, పేపర్ కనిపిస్తుంది. ప్రిస్కిప్షన్ చూసి కృష్ణ షాక్‌ అవుతుంది. బేబీ గ్రోత్ కోసం ట్యాబ్లెట్ వేసుకుంటుంది అంటే మీరా అబార్షన్‌ చేయించుకోలేదు. ఎందుకిలా చేస్తుంది. బిడ్డ ఉన్నందుకు సంతోషించాలా.. అబద్ధం చెప్పినందుకు బాధపడాలా అని కృష్ణ అనుకుంటుంది. వాటిని తీసుకుని తన గదికి వచ్చి మనం మోసపోయామని మురారికి చెప్తుంది.

మీరా గర్భం తీయించుకోలేదు మనతో అబద్ధం చెప్పింది. మీరా కడుపులో మన బిడ్డ క్షేమంగా ఉంది. మన బాధ చూడలేక సరోగసికి ఒప్పుకున్నట్టు చెప్పింది. మన బిడ్డని కడుపులోకి వేసుకున్నాక గర్భం తీయించుకున్నానని అబద్ధం చెప్తుందని కృష్ణ అనగానే.. మన బిడ్డని అడ్డం పెట్టుకుని ఎందుకు ఇలా చేస్తుంది. ఇలాంటి ఆడదాని కడుపులో మన బిడ్డ పెరుగుతుంది. తన నుంచి మన బిడ్డని ఎలా కాపాడుకోవాలని మురారి అంటాడు. మీరా గర్భం ఉంచుకుందని తన నోటితో తనే చెప్పేలా చేయాలని కృష్ణ డిసైడ్ అవుతుంది. తర్వాత పెళ్లి ఎక్కడ చేయాలా అనే దాని గురించి భవానీ ఆలోచిస్తూ ఉంటే కృష్ణ డల్ గా కిందకు రావడం చూసి పిలుస్తుంది. పెళ్లి ఎక్కడ చేద్దామని కృష్ణని అడుగుతుంది. వాళ్ళు ఎంతో ఇష్టపడి చేసుకుంటున్నారని వాళ్ళనే అడగండని మీరాని పిలుస్తుంది. పెళ్లి ఎక్కడ చేసుకోవాలనే ఫాంటసీ ఏమైనా ఉందా చెప్పమని కృష్ణ అడుగుతుంది. పెళ్లిది ఏముంది ఎక్కడ చేసుకుంటున్నామని కాదు ఎవరిని చేసుకుంటామనేది ముఖ్యం.. పెళ్లి ఎక్కడ చేయాలో మీరే డిసైడ్ చేస్తే బాగుంటుందని ముకుంద చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక కాసేపటికి మీరాని కృష్ణ షాపింగ్ అని చెప్పి బయటకు తీసుకొని వెళ్తుంది‌.

ఏమైంది ఇక్కడకి తీసుకొచ్చావు. నువ్వు ఏదో మాట్లాడటానికే ఇక్కడికి రమ్మన్నావ్ కానీ షాపింగ్ అని అబద్ధం చెప్పావ్ కదా అని మీరా అనగానే.. అవును మీ బిడ్డని మీకు ఇవ్వలేకపోయినందుకు చాలా బాధగా ఉందని మీరా అంటుంది. మరీ అంత బాధపడకు. ఎందుకంటే మా బిడ్డ ఎక్కడికీ పోలేదని కృష్ణ అనగానే మీరా షాక్ అవుతుంది. నేను గర్భం తీయించుకోలేదని తెలిసిపోయిందా అని మీరా టెన్షన్ పడుతుంది. మేమ్ మళ్ళీ సరోగసికి వెళ్దామని డిసైడ్ అయ్యామని కృష్ణ చెప్తుంది. వీళ్ళు ఇంకెవరితోనో బిడ్డని కంటే నా ఆటలు ఎలా సాగుతాయని మీరా మనసులో అనుకుంటుంది. కాసేపటికి ఎందుకు టెన్షన్ పడుతున్నావని కృష్ణ అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.