Eto Vellipoyindhi Manasu : తను నా భార్య.. ఇంకోసారి తప్పుగా మాట్లాడితే బాగుండదు!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -74 లో.. రామలక్ష్మిని హాల్లోకి పిలుస్తుంది శ్రీలత. పంతులు గారి చేత సీతాకాంత్, రామలక్ష్మిల శోభనం ముహూర్తం పెట్టిస్తుంది. ఆల్రెడీ శోభనం అయిందని రామలక్ష్మి కవర్ చేసిన కూడా శ్రీలత వినదు. మీ నాన్న చేసిన పనివల్ల శోభనం ఆగిపోయిందని తెలుసని శ్రీలత అంటుంది. పంతులు గారు సిరి, ధనలకి.. వచ్చే బుధవారం మంచి ముహూర్తం ఉందని, సీతాకాంత్, రామలక్ష్మిలకు ఈరోజు మంచి ముహూర్తం ఉందని చెప్తాడు. దాంతో రామలక్ష్మి షాక్ అవుతుంది.