English | Telugu

Krishna Mukunda Murari : ఆ గదిలోకి వచ్చిందెవరన్న డైలామాలో మురారి.. మురిసిపోయిన ముకుంద!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -446 లో.. ముకుంద వాళ్ళ‌ నాన్న దగ్గరికి వెళ్తుంది. ఇంటికి వచ్చి.. తల పట్టుకుంటుంది. నాన్న ఎంత పని చేశారు. ముకుంద పేరుతో ఉన్న అకౌంట్‌లో ఇల్లు అమ్మిన డబ్బు వేశారు. ఇప్పుడు బ్యాంక్‌కి వెళ్లకుండా ఎలా తీసుకోవాలని ముకుంద ఆలోచిస్తుంటుంది. అవును కదా.. నా ల్యాప్ టాప్ దొరికితే చాలు.. కానీ అది ఎక్కడుంది? ఎలా తీసుకోవాలి.? ఆదర్శ్ దగ్గర ఉండి ఉంటుంది కదా? అబ్బా.. ఆదర్శ్ దగ్గరకు వెళ్లాలంటే చాలా కంపరంగా ఉంటుంది. రూపం మారినా ఈ ఆదర్శ్ తలనొప్పి నాకు తీరడం లేదని తల పట్టుకుంటుంది.

ముకుంద అలా అనుకుంటూ ఉండగానే ఆదర్శ్ వస్తాడు. ముకుందా.. జాగింగ్‌కి వెళ్దామా అని అంటాడు. అబ్బా నాకు కాస్త బాలేదు.. మీరు వెళ్లండి అంటు ముకుంద తప్పించుకుంటుంది. నాకు ఈ ఇంట్లో ఎవ్వరూ లేరు అనిపిస్తుంది. మీరే నాకు కనెక్ట్ అయ్యారు. మీకు కూడా ఎవరూ లేరు కదా.. అందుకే మనం కనెక్ట్ అవుతున్నామని అదర్శ్ అంటాడు. ఇది మంచి అవకాశం అనుకుంటూ.. అవును ముకుంద ల్యాప్ టాప్ ఎక్కడుందో ఐడియా ఉందా? దానిలో మా మెమొరీస్ చాలా ఉన్నాయి. అంటుంది తెలివిగా మీరా. దాంతో ఆదర్శ్.. అయ్యో ముకుందా.. ఆ ల్యాప్ టాప్ మొన్నటి దాకా నా దగ్గరే ఉండాలి. కానీ కృష్ణ మొన్న పూజలో పెట్టడానికి తీసుకుంది. తర్వాత ఎక్కడ పెట్టిందో తెలియదు.. కృష్ణను అడిగి తీసుకురానా‌ అని అదర్శ్ అంటాడు. వద్దు. నేను అడుగుతాను.. మీరు వెళ్లండి కాసేపు రెస్ట్ తీసుకుంటానని ముకుంద అంటుంది. కాసేపటికి కృష్ణ బయటకు వెళ్లడం చూసి ముకుంద వారి గదిలోకి వెళ్తుంది. అప్పటికే మురారీ స్నానం చేస్తుంటాడు. అయితే ముకుంద ల్యాప్ టాప్ వెతికే క్రమంలో చిన్న బొమ్మ కింద పడి శబ్దం వస్తుంది. అది విన్న మురారీ.. కృష్ణా కృష్ణా అని అంటాడు. వెంటనే ముకుంద.. కింద పడినదాన్ని తీసి పైన పెట్టేసి మెళ్లగా వెళ్లిపోవాలనుకుంటుంది. కానీ మురారీ.. ఓయ్ కృష్ణా.. ఆ టవల్ ఇవ్వవా ప్లీజ్.. మరిచిపోయాను.. ప్లీజ్ అంటూ అరుస్తుంటాడు. దాంతో టవల్ అందుకుని మురారీ చేతికి ముకుంద అందివ్వబోతే.. కృష్ణ అనుకున్న మురారీ.. ముకుంద చేతిని పట్టేసుకుని లోపలికి లాగడానికి ట్రై చేస్తాడు. ముకుంద అల్లాడిపోతుంది. ఆ చేయి పట్టుకున్నందుకు మురిసిపోతుంది. లోపలికి వెళ్లకుండా బలవంతంగా ఆపుకుంటుంది. శోభనం అయ్యాక సిగ్గేంటి లోపలికి రా అంటూ‌ మురారి లాగుతూనే ఉంటాడు. కాసేపటికి జాగ్రత్తగా తన చేతిని వదిలించుకుని ముకుంద తన గదిలోకి వెళ్తుంది.

ఇక మురారీ స్నానం చేసి బయటికి వస్తాడు. అప్పుడే గదిలోకి వచ్చిన కృష్ణతో.. ఎందుకు రాలేదు స్నానం గదిలోకి రమ్మంటే అని వాదిస్తాడు‌. నేను ఎక్కడ వచ్చాను. మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు.. వెళ్లి రెడీ అవ్వండి అని తిట్టేస్తుంది కృష్ణ. దాంతో మురారీ అదే తలపట్టుకుని ఆలోచిస్తాడు. కృష్ణ తిట్టడంతో కూల్ అవుతాడు కానీ.. మరి పొద్దున్నే వచ్చింది ఎవరు? ఇందాక బాత్ రూమ్ దగ్గరకు వచ్చి టవల్ ఇచ్చింది ఎవరని ఆలోచిస్తూనే ఉంటాడు. మరోవైపు నెమ్మదిగా ఆదర్శ్ గదిలోకి మీరా వెళ్లి.. ఆదర్శ్ లేకపోవడంతో గది మొత్తం వెతికి ల్యాప్ టాప్ దొంగిలిస్తుంది. హమ్మయ్యా.. నాన్న వేసిన డబ్బులు ఇప్పుడు తీసుకోవడం చాలా ఈజీ అని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.