English | Telugu

మొన్న ఎన్టీఆర్.. నేడు రిషబ్.. ఇద్దరికీ బిగ్ షాక్!

మొన్న ఎన్టీఆర్.. నేడు రిషబ్.. ఇద్దరికీ బిగ్ షాక్!

Publish Date:May 22, 2025

  బయోపిక్ ట్రెండ్ కొంతకాలంగా ఊపందుకుంది. బయోపిక్ లు చేయడానికి స్టార్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఒకే బయోపిక్ కోసం ఒకే సమయంలో ఇద్దరు స్టార్స్ పోటీపడటం అనేది ఇటీవల చూస్తున్నాం.    భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ గా 'మేడ్ ఇన్ ఇండియా' ప్రకటన వచ్చింది. రాజమౌళి సమర్పణలో రూపొందనున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తాడని వార్తలొచ్చాయి. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే వారి ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ గా మరో సినిమా తెరకెక్కనుందని, ఇందులో ఆమిర్ ఖాన్ నటిస్తున్నాడని తెలిసి.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. ఈ బయోపిక్ ని ఎన్టీఆరే ముందు చేస్తే బాగుంటుందని వారు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే కన్నడ స్టార్ రిషబ్ శెట్టికి వచ్చింది.     రిషబ్ శెట్టి టైటిల్ రోల్ లో ఛత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్ ను గతేడాది చివరిలో ప్రకటించారు. సందీప్ సింగ్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమా.. 2027 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే దీనికంటే ముందే మరో ఛత్రపతి శివాజీ బయోపిక్ థియేటర్లలో అడుగుపెట్టనుంది.   'రాజా శివాజీ' పేరుతో ప్రముఖ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ స్వీయ దర్శకత్వంలో ఛత్రపతి శివాజీ బయోపిక్ ను తాజాగా అనౌన్స్ చేశాడు. జ్యోతి దేశ్‌పాండే, జెనీలియా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 మే 1న మరాఠీ, హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇది ఓ రకంగా రిషబ్ శెట్టికి షాక్ అనే చెప్పాలి.     శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'ఛావా' ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ముఖ్యంగా మహారాష్ట్రలో సంచలన వసూళ్లు సాధించింది. ఆ ఉత్సాహంతోనే శివాజీ బయోపిక్ కి రితేష్ శ్రీకారం చుట్టినట్టున్నాడు. ఈ సినిమా కూడా ఛావా స్థాయిలో సంచలనాలు సృష్టిస్తే.. రిషబ్ శెట్టి ప్రాజెక్ట్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది.  
Did Deepika walk out or Sandeep Rejected?

Did Deepika walk out or Sandeep Rejected?

Publish Date:May 22, 2025

Deepika Padukone is one of the biggest powerhouses of Bollywood Cinema and a bonafide star. She made a successful combination with Shah Rukh Khan and more recently, both his 1000 crore blockbusters - Pathaan and Jawan- had her in leading role. So, if she makes unreasonable demands, would Bollywood just accept and tow along?  The rumor mills have been going overboard spreading that Sandeep Reddy Vanga "rejected" her due to her unreasonable demands to be part of Spirit. Conversely, she is said to be cast in Allu Arjun and Atlee's film. Many are asking if she walked out due to "creative differences" about her character or if really director rejected.  Sridevi put forth some exorbitant conditions when Baahubali makers approached her but she did Thalapathy Vijay's Puli, that came out an year later. Now, the makers of Spirit, the next film by Sandeep Reddy Vanga with Prabhas as the main lead, said to have approached Deepika and she put forth unreasonable demands.  Not going into specifics, one wonders, if she is known to put forth any unreasonable demands, she would not have been part of Kalki 2898 AD, with Prabhas in lead role and she will join Kalki 2 sets for sure. She did give lip sync to Telugu lines and she did not dub. So, what changes for Sandeep Reddy Vanga's film? The makers are not in tone with paying Rs.20 crores paycheck and also for 8 hours shift timings. Sandeep Reddy already stated that he has no problem with actors coming at their time but he wants them to inform him beforehand and stick to it.  A 20-crore paycheck is not an unreasonable demand by a successful actress like Deepika Padukone as rumors stated Priyanka Chopra Jonas, asked for close to 25-30 crores paycheck for SSMB29 opposite Mahesh Babu in the direction of SS Rajamouli. Well, Rajamouli did not want to handle demands of Sridevi but he is okay with Priyanka?  The point seems to be simple, Deepika and Sandeep might have had disagreements about script and could have decided to not go forward. But this unreasonable demands rumor doesn't really sync in as she is now said to be a part of "AA22 X A6". Wouldn't Atlee also be afraid to handle all those demands, ask netizens.  Until, we know the real reasons behind anyone's inclusion or exclusion, these rumors can only be seen as mud-slinging activities and nothing much. Even she demands 8-hour shift and a big paycheck, for her stature it should not be a huge problem.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

వరసగా వచ్చిన నందులు ఆయన కడుపు నింపలేదు.. ఆ ఒక్క పాట సిరివెన్నెల జీవితాన్నే మార్చేసింది!

Publish Date:May 20, 2025

  నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని.. సుఖాన మనలేని వికాసమెందుకని.. అంటూ నేటి వ్యవస్థని ప్రశ్నించినా, జామురాతిరి జాబిలమ్మా, ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది.. అంటూ ప్రేమ భావాలు పలికించినా, బోటనీ పాఠముంది.. మ్యాటనీ ఆట ఉంది, భద్రం బీ కేర్‌ఫుల్‌ బ్రదరూ.. అంటూ యువతను మేల్కొలిపినా అది సిరివెన్నెల సీతారామశాస్త్రి కలానికే చెల్లింది. తన పాటలోని భావాల ద్వారా శ్రోతలను ఆలోచింప జేయడం లేదా ఆస్వాదించేలా చేయడం అనేది సిరివెన్నెలకు వెన్నతో పెట్టిన విద్య. సినిమాలో ఆయన రాసిన పాట ఉందీ అంటే అది ఎంతో కొంత విజ్ఞానాన్ని పంచేది, సామాజిక స్పృహను కలిగించేది, ఆహ్లాదాన్ని పంచేది అయి ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికీ తెలుసు. 1986లో సినీ గేయరచయితగా కెరీర్‌ను ప్రారంభించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎంతో మంది యువ రచయితలకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయనలా పాటలు రాసి మంచి పేరు తెచ్చుకోవాలని ఎంతోమంది ఇండస్ట్రీకి వచ్చారు. శ్రీశ్రీ, వేటూరి, ఆత్రేయ వంటి రచయితల శైలి వేరు, సిరివెన్నెల దారి వేరు అన్నట్టుగా ఉండే ఆయన పాటలంటే ఇష్టపడని వారుండరు.    కాకినాడలో ఎం.ఎ. చేస్తున్న చేంబోలు సీతారామశాస్త్రికి ఒకరోజు దర్శకుడు కె.విశ్వనాథ్‌ నుంచి పిలుపు వచ్చింది. ‘సిరివెన్నెల’ చిత్రంలోని అన్ని పాటలూ రాసే అవకాశం ఇచ్చారు. అయితే అంతకు రెండేళ్ళ ముందే నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన ‘జననీ జన్మభూమి’ చిత్రంలో సీతారామశాస్త్రి రచించిన గంగావతరణం గీతాన్ని తీసుకున్నారు విశ్వనాథ్‌. అది ఆయనకు బాగా నచ్చడంతో ‘సిరివెన్నెల’ చిత్రంలోని పాటలు రాయగల ప్రతిభ సీతారామశాస్త్రిలో ఉందని గుర్తించి అన్ని పాటలూ ఆయనకే ఇచ్చారు. చిత్రంలో 9 పాటలు ఉండగా, ప్రతి పాటనూ ఓ ఆణిముత్యంలా మలిచారు సీతారామశాస్త్రి. పాటలకు విపరీతమైన ఆదరణ లభించింది. అలా సిరివెన్నెల ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. మొదటి మూడు సంవత్సరాలు ఉత్తమ గేయ రచయితగా నంది అవార్డులు అందుకున్నప్పటికీ ఆర్థికంగా ఆ సినిమాలు ఆయనకు ఉపయోగపడలేదు. తనపై ఆధారపడిన తమ్ముళ్లు, చెల్లెళ్లతో సహా దాదాపు 15 మందిని పోషించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. దాంతో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు సిరివెన్నెల.    ఉత్తమ పాటల రచయితగా 1986 నుంచి మూడేళ్లపాటు వరుసగా నంది అవార్డులు అందుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రిని ఆర్థికంగా మాత్రం సినీ రంగం మొదట్లో ఆదుకోలేకపోయింది. అవార్డు చిత్రాల పాటల రచయితగా ముద్ర పడిపోయిన ఆయన మద్రాసులో కుటుంబాన్ని పోషించలేక మళ్లీ కాకినాడకు వెళ్లిపోయి ఉద్యోగం చేసుకోవాలని అనుకున్నారు. వరసగా సంగీతపరమైన చిత్రాలకు పాటలు రాసే అవకాశాలే వస్తుండటంతో ఆయన మీద క్లాసికల్‌ రైటర్‌గా ముద్రపడిపోయింది. ఆ రోజుల్లో ద్వంద్వార్థాల పాటలకు క్రేజ్‌ ఉండడం, అలాంటి పాటలు రాయకూడదని సిరివెన్నెల నిర్ణయించుకోవడంతో ఆయనకు కమర్షియల్‌ చిత్రాలలో పాటలు రాసే అవకాశాలు రాలేదు. అయితే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది ఓ పాట. ఆ పాటతో సినీ పరిశ్రమలో ఆయన విజయ యాత్ర మొదలైంది. డబ్బుకు డబ్బు పేరుకు పేరు తెచ్చిపెట్టింది.    తను డైరెక్ట్‌ చేస్తున్న సినిమాకి ఒక పాట రాయమని బి.గోపాల్‌ అడిగారు. మొదట కొంచెం సంకోచించారు సిరివెన్నెల. ఎక్కడ డబుల్‌ మీనింగ్‌ పాట రాయమంటారోనని టెన్షన్‌ పడ్డారు. కానీ, దానికి భిన్నంగా బి.గోపాల్‌ ఆ పాట ఎలా ఉండాలో చెప్పారు. సాధారణ ప్రేక్షకులకు సైతం ఎంతో సులువుగా అర్థమయ్యే చిన్న చిన్న పదాలతో ఒక మంచి పాట రాయమని ఆయన చెప్పడం, దానికి ఇళయారాజా అద్భుతమైన ట్యూన్‌ ఇవ్వడంతో మొదటిసారి ఒక కమర్షియల్‌ సినిమాకు పాట రాశారు. అందరూ ఎంతో ఈజీగా పాడుకునే పాట ఆయన కలం నుంచి జాలువారింది. అదే.. ‘బలపం పట్టి భామ బళ్ళో అఆ ఇఈ నేర్చుకుంటా..’ పాట. 1990 సెప్టెంబర్‌ 24న విడుదలైన ‘బొబ్బిలిరాజా’ సూపర్‌హిట్‌ కావడం, సిరివెన్నెల రాసిన ఆ పాటకు జనం బ్రహ్మరథం పట్టడంతో సిరివెన్నెల సినీ జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. అక్కడి నుంచి సిరివెన్నెల పాటల ప్రభంజనం మొదలైంది. దాదాపు 35 సంవత్సరాలపాటు ఆయన పాటల ప్రయాణం నిర్విరామంగా కొనసాగింది. ఈ మూడు దశాబ్దాలలో సిరివెన్నెల చేసిన ప్రయోగాలు అసామాన్యమైనవి. ఇదీ అదీ అని కాకుండా అన్ని తరహా పాటలు రాసి అందర్నీ మెప్పించారు. నమ్మకు నమ్మకు ఈ రేయినీ.., లలిత ప్రియ కమలం విరిసినదీ.., ఆకాశంలో ఆశల హరివిల్లూ.., తెలవారదేమో స్వామి.., చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకీ.., చిలకా ఏ తోడు లేక ఎటేప్పమ్మ ఒంటరి నడక.., కన్నుల్లో నీ రూపమే.., కళ్ళలొకి కళ్ళు పెట్టి చూడవెందుకు.., ఆకాశం దిగి వచ్చి వెయ్యాలి మన పందిరి.., సీతమ్మ అందాలూ గోత్రాలు.. ఇలా తన కెరీర్‌లో కొన్ని వేల పాటలు రాసి ప్రేక్షకులను, శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ప్రతి పాటలోనూ ప్రత్యేకతను చూపిస్తూనే తన కెరీర్‌లో ఏనాడూ వెకిలి పాటలు, డబుల్‌ మీనింగ్‌ పాటలు రాయకుండా నిబద్ధతతో ఉన్న సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎంతో మంది యువ రచయితలకు ఆదర్శంగా నిలిచారు.   (మే 20 సిరివెన్నెల సీతారామశాస్త్రి జయంతి సందర్భంగా..)  

సల్మాన్ ఖాన్ కేసులో జితేందర్ సింగ్ అరెస్ట్..విచారణలో ఏం చెప్పాడో తెలిస్తే షాక్ అవుతారు 

Publish Date:May 22, 2025

సల్మాన్ ఖాన్(Salman Khan)ముంబై(Mumbai)లో అత్యంత ఖరీదైన ప్రాంతంగా పిలవబడే 'బాంద్రా'(Bandra)లోని గెలాక్సీ అపార్ట్ మెంట్(Galaxy Apartments)లో ఎక్కువ భాగం నివాసం ఉంటాడు. ఎన్నో ఖరీదైన హౌసెస్ ఉన్నప్పటికీ బాల్యంలోని జ్ఞాపకాలు, మరియు కుటుంబ వాతావరణం కారణంగా గెలాక్సీ లో ఉండటానికి ఇష్టపడతాడు. ఈ నెల 20 న ఉదయం పది గంటల సమయంలో ఒక వ్యక్తి సల్మాన్ ఇంటి ముందు అనుమానాస్పదంగా తిరిగాడు. దీంతో పోలీసులు అతన్ని అక్కడ నుంచి వెళ్లిపొమ్మని చెప్పారు. ఆ వెంటనే  కోపంతో తన సెల్ ఫోన్ ని విసిరి కొట్టి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. కానీ అదే రోజు సాయంత్రం మళ్ళీ గెలాక్సీ దగ్గరకొచ్చి, అదే అపార్ట్ మెంట్ లో ఉంటున్న ఒక వ్యకి కారు వెనక నుంచి గెలాక్సీ లోపలకి ప్రవేశించాడు. అదే సమయంలో లోపల విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది అతన్ని పట్టుకొని పోలీసులకి సమాచారం ఇచ్చింది. అనంతరం పోలీసుల  విచారణలో సదరు వ్యక్తి మాట్లాడుతు నా పేరు జితేందర్ కుమార్ సింగ్.చత్తిస్ గడ్ రాష్ట్రం నుంచి సల్మాన్ కలవడానికి వచ్చాను. గెలాక్సీ లోపలకి అనుమతించకపోవడంతో  దొంగచాటుగా వెళ్లానని చెప్పాడు. ప్రస్తుతానికి పోలీసులు జితేందర్ ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసారు. సల్మాన్ ని చంపుతామని గత కొంత కాలం నుంచి గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు జితేంద్ర కుమార్ సల్మాన్ ఇంట్లోకి ప్రవేశించడం సంచలనంగా మారింది.  

అబ్బా భానుమతి...ఎంత అందంగా ఉన్నావో పళ్ళ తోటలాగా

Publish Date:May 22, 2025

  ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ ఎపిసోడ్ ని కిట్టి పార్టీగా తీసుకురాబోతోంది. ఈ ఎపిసోడ్ కి చక్రవాకం సీరియల్ హీరోయిన్ ప్రీతి అమీన్, ఋతురాగాలు శృతి, నటకుమారి, అమూల్య గౌడ వంటి వాళ్లంతా వచ్చారు. "బేసిక్ గా కిట్టి పార్టీలో రకరకాల గేమ్స్ ఆడుతూ ఉంటారు. మీకు ఏ గేమ్ ఇష్టం" అని అడిగింది హోస్ట్ శ్రీముఖి. "నాకు ఏ గేమ్ ఐనా గెలవడం ఇష్టం. అందుకే నేను ఈ హ్యాండ్ బ్యాగ్ తెచ్చాను" అని చెప్పింది ప్రీతీ...ఇక శృతి బ్యాగ్ చూసి శ్రీముఖి షాక్ అయ్యింది. "అమ్మో శృతి అక్క చూడు ఎంత పెద్ద బ్యాగ్ తెచ్చిందో" అనేసింది. గెలిస్తే వచ్చే డబ్బులు తీసుకెళ్లడానికి వీళ్ళు ఇంత పెద్ద బ్యాగ్ లు తెచ్చారు అన్నాడు హరి. తర్వాత శ్రీముఖి నటకుమారి దగ్గరకు వెళ్లి "ఎప్పుడైనా రియల్ లైఫ్ లో కిట్టి పార్టీకి వెళ్ళావా" అని అడిగింది శ్రీముఖి.."వెళ్ళలేదు ఎందుకంటే నన్ను ఎవరూ పిలవలేదు" అని చెప్పింది శ్రీముఖి. ఇక అమూల్య గౌడ దగ్గరకు వచ్చి "సీరియల్ లో ఎలా ఉంటావు మీనా...చీర కట్టుకుని పూలు అమ్ముకుని పిచ్చిదానిలా ఉంటావ్...ఇక్కడ చూడు ఎలా ఉన్నావో" అంది శ్రీముఖి. దాంతో అమూల్య బ్లాక్ డ్రెస్ బ్లాక్ గాగుల్స్ తో రాంప్ వాక్ చేసింది. తర్వాత భానుమతి దగ్గరకు వెళ్ళింది శ్రీముఖి "ఈవిడ కోసం కిట్టి పార్టీ ఏంటీ సొంతంగా పార్టీ కూడా పెట్టొచ్చు.. అంత అందంగా ఉన్నారు. మీ నాన్నగారికి ఏమన్నా పళ్ళ తోట ఉందా..అందుకేనా బుగ్గలు యాపిల్ పళ్ళలా..కళ్ళు ద్రాక్ష పళ్ళలాగా..పెదాలు చెర్రీ పళ్ళలాగా ఉన్నాయి " అని తెగ మోసేసాడు హరి. దాంతో మిగతా వాళ్లంతా ఓ అంటూ కేకలేశారు.

Nazeeruddin Shaik wins aha Telugu Indian Idol 3

Publish Date:Sep 23, 2024

In a thrilling grand finale streamed on aha OTT, 19-year-old Nazeeruddin Shaik from Andhra Pradesh emerged victorious as the winner of aha Telugu Indian Idol Season 3. His captivating performances throughout the competition earned him both the prestigious title and a cash prize of Rs. 10 lakh. Recently clearing his CA intermediate examinations, Nazeeruddin also received the exciting opportunity to lend his voice to the highly anticipated upcoming film starring Pawan Kalyan, OG. His remarkable journey to victory was characterised by consistent excellence, which endeared him to both the audience and the judges. Anirudh Suswaram secured second place, winning Rs. 3 lakh, while GV Shri Kerthi claimed third place with a prize of Rs. 2 lakh. The show, which concluded after nearly 26 weeks of fierce competition, was judged by the esteemed Thaman S, Geetha Madhuri, and Karthik, all of whom noted that this season showcased extraordinary talent. Judge Geetha Madhuri said, "aha Telugu Indian Idol Season 3 was an incredible experience filled with talented contestants. It truly felt like a celebration of music. Choosing the finalists was extremely challenging, and every elimination was painful." Nazeeruddin was born on November 2, 2004, in Tadepalligudem to Shaik Baji, a motor mechanic, and Madeena Beebi, who passed away a year ago. His sister, Vahida Rehman, has stepped in to support him after their mother's passing. He completed his schooling at Vignana Vikas E.M School and continued his education at GSR E.M School. He pursued his Junior College and CA Intermediate at Sri Medha Commerce College in Guntur, aspiring to become a Chartered Accountant while nurturing his passion for music. Nazeeruddin's musical journey has been profoundly shaped by his maternal grandparents, Kasim Saheb and Fatima Bee. His maternal grandmother, a Carnatic music guru, played a pivotal role in cultivating his talent. Growing up listening to the iconic songs of Ghantasala ignited his dedication to music. Reflecting on his victory, Nazeeruddin shared, "My journey with music began when I was just four years old. It was my grandfather, Kasim garu, and his sister whom I affectionately call Nani, who introduced me to this world. She enrolled me in Carnatic music lessons, while my grandfather taught me the nuances of cinematic music. Having sung for Ghantasala garu, his admiration for him has never wavered. For 47 years, he has honored Ghantasala's memory by observing his death anniversary in our village, Tadepalligudem. Thanks to my grandfather's efforts, a statue of Ghantasala garu stands in our village." "Winning the title of Telugu Indian Idol Season 3 is a key milestone for me. Performing in front of Thaman sir, Geetha Madhuri ma’am, and Karthik sir was an honor. Their feedback, along with lessons from my fellow contestants, has shaped my growth as a singer. Moving forward, I aim to be a leading musician in the industry while pursuing a career in finance, " he added. The competition began with over 15,000 aspiring singers, showcasing immense talent throughout the season. Initial auditions took place on May 4, 2024, in New Jersey and Hyderabad. The top 12 finalists included Bharat Raj, Keerthana, Keshav Ram, Hari Priya, GV Shri Kerthi, Nazeeruddin, Skanda, Duvvuri Sridhruthi, Rajani Sree, Sai Vallabha, Khushal Sharma, and Anirudh Suswaram. After rigorous eliminations and public voting across 28 episodes, the competition culminated in a final showdown featuring the top five contestants: Anirudh Suswaram, Skanda, Keerthana, Sri Keerthi, and Nazeeruddin. The finalists dazzled in vibrant attire during the blockbuster finale, which included special performances from the judges and contestants. Judge Geetha Madhuri, in a striking red outfit, captivated the audience with her exceptional performance. The Judges Thaman and Karthik also presented outstanding performances during the blockbuster finale episode. The blockbuster finale, streamed on September 20-21, 2024, celebrated the remarkable journeys of these talented singers. If you missed the thrilling finale episode, catch it now only on aha.

ఎన్టీఆర్ 'డ్రాగన్'లో విద్యాబాలన్!

Publish Date:May 21, 2025

  ఆగస్టులో బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2'తో ప్రేక్షకులను పలకరించనున్న జూనియర్ ఎన్టీఆర్.. తన తదుపరి సినిమాని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి 'డ్రాగన్' టైటిల్ లాక్ చేసినట్లు సమాచారం. ఇందులో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.   ప్రశాంత్ నీల్ సినిమాల్లో ఫిమేల్ రోల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. నిడివితో సంబంధం లేకుండా మంచి ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు డ్రాగన్ కోసం కూడా ఒక పవర్ ఫుల్ ఫిమేల్ రోల్ ని రాశాడట. ఆ రోల్ కి విద్యాబాలన్ అయితే బాగుంటుందని ఆమెని సంప్రదించినట్లు సమాచారం. ఈ పాత్ర చేయడానికి విద్యాబాలన్ సుముఖత వ్యక్తం చేసినట్లు వినికిడి.   కాగా, గతంలో ఎన్టీఆర్ బయోపిక్ లో బాలకృష్ణ సరసన నటించింది విద్యాబాలన్. అప్పుడు బాబాయ్ కి జోడిగా నటించిన బాలన్.. ఇప్పుడు అబ్బాయ్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుందని అనే వార్త ఆసక్తికరంగా మారింది.  

Sudha Kongara & Hombale project is going to be Biggest Multistarrer

Publish Date:Jul 12, 2022

Even though it came before 'KGF,' Hombale Films became well-known with that film. The films are being announced, completed, and ready for release as a result of the momentum created by that film. Production is currently working on 'Salaar' in Telugu and 'Tyson' in Malayalam. Other pan-India films have also just been announced.   However, a film directed by Sudha Kongara was recently announced. Except for the fact that they stated that it will be a big film, they did not mention the casting. There are some new rumours floating around about this. If those rumours are true, this combination will be spectacular. According to sources, Sudha Kongara project is going to be multi starrer.  Furthermore, the names of those heroes are currently being spread.   According to the latest rumours, this film would star Suriya and Dulquer Salman, who have established as star heroes in the South with a string of superhits. According to industry reports, Surya, who has become acquainted of Sudha Kongara's direction in 'Akaasham Nee Haddura,' responded OK without even hearing the story. It is stated that discussions about this film are ongoing, and that full details will be released soon. Pre-production work will begin soon.   Hombale is synonymous with big-budget films. This film is expected to be in the same budget range as the previous one. Suriya's film is also popular in Telugu. Dulquer films have a cult following in the South. This combination is surely going to be crazy.

Ranbir and Alia in love

Publish Date:May 10, 2018

శుభం

Publish Date:May 9, 2025

సింగిల్

Publish Date:May 9, 2025

హిట్ 3

Publish Date:May 1, 2025

రెట్రో

Publish Date:May 1, 2025

Subham

Publish Date:May 9, 2025

Single

Publish Date:May 9, 2025

Hit 3

Publish Date:May 1, 2025

Retro

Publish Date:May 1, 2025

Sarangapani Jathakam

Publish Date:Apr 25, 2025