English | Telugu
'ఉస్తాద్ భగత్ సింగ్' అప్డేట్.. షాకిచ్చిన హరీష్ శంకర్..!
Updated : May 22, 2025
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవల 'హరి హర వీరమల్లు' షూటింగ్ పూర్తి చేశారు. ఈ మూవీ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే 'ఓజీ' షూట్ కూడా స్టార్ట్ చేశారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వీటితో పాటు 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా లైన్ లో ఉంది. కానీ, ఆ సినిమాను పవన్ పూర్తి చేస్తాడా లేదా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ తాజాగా 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది.
'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై అనౌన్స్ మెంట్ తోనే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే కొంతభాగం షూట్ చేశారు. గ్లింప్స్ కూడా విడుదలై ఆకట్టుకుంది. అయితే పవన్ పాలిటిక్స్ తో బిజీ అవ్వడం.. 'హరి హర వీరమల్లు', 'ఓజీ' ఆలస్యమవ్వడంతో 'ఉస్తాద్ భగత్ సింగ్' ఉంటుందా లేదా? అనే డౌట్స్ వచ్చాయి. వాటికి చెక్ పెడుతూ.. తాజాగా అదిరిపోయే అప్డేట్ వచ్చింది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుపుతూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇది అభిమానులకు, సినీ ప్రియులకు ఫ్యాన్ బాయ్ అందిస్తున్న ఫీస్ట్ అని..సెలెబ్రేట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి, చాలా ఏళ్ళు గుర్తుండిపోతుంది అని రాసుకొచ్చారు.
మొత్తానికి 'హరి హర వీరమల్లు', 'ఓజీ'తో పాటు 'ఉస్తాద్ భగత్ సింగ్'ను కూడా పవన్ పూర్తి చేయబోతున్నారు. అంటే తక్కువ గ్యాప్ లోనే ఆయన నుంచి మూడు సినిమాలు రాబోతున్నాయి. వీటి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి, తన ఫుల్ ఫోకస్ ని పాలిటిక్స్ పై పెట్టే అవకాశముంది.
