English | Telugu

మాటలొద్దు మంత్రిగారు చేతల్లో చూపండి!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు మొత్తంగా రాజధాని చుట్టూనే తిరుగుతున్నాయి. నిజానికి ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో ఎలాంటి వివాదం లేదు. అదొక వివాదమే కాదు. చట్ట పరంగా చూసినా, మరోల చూసినా, అమరావతి ఆంధ్ర ప్రదేశ్ ఏకైక రాజధాని.అందులో మరోమాటకు అవకాశమే లేదు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వం గెజిట్’లో ప్రకటించింది. న్యాయస్థానాలు తీర్పులిచ్చాయి. ఎనిమిదేల్లాకు పైగా, అకడి నుంచే పరిపాలన సాగుతోంది., ఏపీ ఏకైక రాజధాని అని చెప్పేందుకు ఇంకేమి కావాలి, అంటే, సమాధానం ఉండదు. ఒక విధంగా బీజేపీ వారి భాషలో చెప్పాలంటే, ప్రత్యేక హోదా వివాదం లానే, రాజధాని విషయం కూడా ముగిసిన అధ్యాయం.

పీకే పార్టీ వెనుక కేసీఆర్?.. బీజేపీయేతర కూటమి ఏర్పాటు బరాబర్!

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే కొత్త పార్టీ వెనుక కూడా ఎన్నికల వ్యూహమే ఉందా? ఆ వ్యూహం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుదా? అన్న సందేహాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి. ఉరుము లేని పిడుగులా ప్రశాంత్ కిశోర్ తాను కొత్త పార్టీ స్థాపించబోతున్నట్లు ప్రకటించడంతో ఈ ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే వీటిని కేవలం ఊహాగాన సభలుగా కొట్టి పారేయడానికి వీల్లేదని పరిశీలకులు అంటున్నారు. ప్రశాంత్ కిశోర్ పార్టీ ప్రకటనకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసఆర్ తో సుదీర్ఘ మంతనాలు జరపడం ఇందు కోసం ఆయన ప్రగతి భవన్ లో రెండు రోజుల బస చేయడాన్ని తార్కానంగా చూపిస్తున్నారు.

బియ్యం గింజలపై శ్రీరామ నామం...ఆ రామునికే అక్షింతలుగా సమర్పణం

భక్తికి ఎల్లలు ఉండవంటారు. భగవంతునిపై తన భక్తిని ప్రదర్శించేందుకు ఏకంగా కన్నులు పెకలించుకున్నాడు కన్నప్ప. ప్రాణాలనే తృణ ప్రాయంగా అర్పించేశాడు మార్కండేయులు. భగవంతుని పై తనకున్న భక్తిప్రపత్తులను బియ్యపు పై గింజ అక్షరాలుగా మలిచి ఆ దేవుడికే తలంబ్రాలుగా అర్పించాడు ఈ భక్తుడు. నిజామాబాద్‌ ఇందూరు ఆర్టీసీ కాలనీకి చెందిన బిల్ల బాబు, పదవి విరమణ అనంతరం ఆధ్యాత్మిక చింతనతో శ్రీరాముడి పై తనకున్న భక్తి భావాన్ని చాటుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఎనిమిది లక్షల యాభై ఒక్క వెల బియ్యపు గింజల పై శ్రీరామ నామాన్ని రాశారు. ఇందు కోసం ప్రతి రోజు ఉదయాన్నే నిద్రలేచి, స్నానాంతరం భగవంతునికి పూజ చేసి జెల్‌ పెన్‌తో రామ నామాన్ని తెలుగు, హిందీ భాషలలో లిఖిస్తున్నారు. ఈ విధంగా ఇప్పటి వరకు లిఖించిన బియ్యపు గింజలను ఇందూరు ఖిల్లా రామాలయంలో శ్రీసీతారాముల వారి కళ్యాణానికి రెండు మార్లు, ఇందూరు సుభాష్‌ నగర్‌ రామాలయంలో ఒక సారి, భద్రాచలం శ్రీసీతారాముల కల్యాణంలో తలంబ్రాలలో కలపటం జరిగింది.

ఏపీలోతల్లి కాంగ్రెస్’తో పిల్ల కాంగ్రెస్ పొత్తు.. పీకే ప్లాన్ ..

ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిశోర్’ వయసు ఉంటే ఓ 40 ఏళ్ళు ఉండవచ్చును. 2014 సార్వత్రిక ఎన్నికలకు ఒకటి రెండు సంవత్సరాల ముందు, 2012 ఆ ప్రాంతంలో ఆయన ఎన్నికల వ్యూహకర్తగా దేశానికి పరిచయం అయ్యారు. అంటే, ఓ దశాబ్ద కాలంగా మాత్రమే దేశ రాజకీయాలలో ఆయన పేరు వినిపిస్తోంది.నిజానికి గత సంవత్సరం జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాతనే ఆయన బ్రాండ్ ఇమేజ్ బాగా పెరిగి పోయింది. ఇంతలోనే పీకే, ఇంతింతై ..అన్నట్లుగా ఎదిగిపోయారు. ఎంతగా అంటే, కురువృద్ధ కాంగ్రెస్ పార్టీ మొదలు, వైసీపీ, తృణమూల్. ఎన్సీపీ వంటి పిల్ల కాంగ్రెస్ పార్టీలు అలాగే, తెరాస, డీఎంకే వంటి ప్రాంతీయ, కుటుంబ పార్టీలు... ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న లౌకికవాద పార్టీలన్నీ క్యూకట్టి మరీ పీకేని శరణు వేడుతున్నాయి.

మూడోరోజు జోరుగా అమరావతి రైతుల ‘మహా పాదయాత్ర’..

క‌దం క‌దం క‌దిపారు. అలుపెర‌గ‌కుండా పోరాడుతున్నారు. వారి ల‌క్ష్యం ఒక‌టే. వారి గ‌మ్యం ఒక‌టే. అమ‌రావ‌తినే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగించ‌డం. ఆంధ్రుల క‌ల‌ల కేపిట‌ల్‌ను మూడు ముక్క‌లు చేసే ప్ర‌య‌త్నాన్ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం విర‌మించుకోవ‌డం. ఇందుకోసం రెండేళ్లుగా ఉద్య‌మిస్తున్నారు. ధ‌ర్నాలు, దీక్ష‌లు, నిర‌స‌న‌ల‌తో హోరెత్తిస్తున్నారు. అయినా.. పాల‌కుల తీరు మార‌డం లేదు. జ‌గ‌న్ స‌ర్కారు వెన‌క‌డుగు వేయ‌డం లేదు. దీంతో.. జ‌గ‌న్‌రెడ్డి బండ‌రాయి హృద‌యాన్ని ఆ దేవుడే మార్చాలంటూ.. క‌లియుగ వెంక‌న్న స్వామికి మొక్కుకోవ‌డానికి అమ‌రావ‌తి రైతులు దండుగా క‌దిలారు. త‌మ గోడు మిగ‌తా జిల్లాల వారికీ తెలిసేలా.. మ‌హా పాద‌యాత్ర చేస్తున్నారు. ఉరిమే ఉత్సాహంతో.. స‌డ‌ల‌ని సంక‌ల్పంతో.. అడుగులో అడుగు వేస్తున్నారు. న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం పేరుతో తిరుమ‌ల బాట ప‌ట్టారు అమ‌రావ‌తి రైతులు.