English | Telugu

పీకే పార్టీ వెనుక కేసీఆర్?.. బీజేపీయేతర కూటమి ఏర్పాటు బరాబర్!

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే కొత్త పార్టీ వెనుక కూడా ఎన్నికల వ్యూహమే ఉందా? ఆ వ్యూహం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుదా? అన్న సందేహాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి.

ఉరుము లేని పిడుగులా ప్రశాంత్ కిశోర్ తాను కొత్త పార్టీ స్థాపించబోతున్నట్లు ప్రకటించడంతో ఈ ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే వీటిని కేవలం ఊహాగాన సభలుగా కొట్టి పారేయడానికి వీల్లేదని పరిశీలకులు అంటున్నారు.

ప్రశాంత్ కిశోర్ పార్టీ ప్రకటనకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసఆర్ తో సుదీర్ఘ మంతనాలు జరపడం ఇందు కోసం ఆయన ప్రగతి భవన్ లో రెండు రోజుల బస చేయడాన్ని తార్కానంగా చూపిస్తున్నారు.

అలాగే ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్, తెరాసాల ములాఖత్ కోసం ప్రయత్నించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా వారు ఉదహరిస్తున్నారు. ప్రశాంత్ కిశోర్, కేసీఆర్ లు ఇరువురూ కూడా బీజేపీయేతర కూటమి కోసం ప్రయత్నించడం, ఆ ప్రయత్నం విఫలం కావడంతో కొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నారా అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.ఈ సందేహాలకు వారు తార్కికంగా బేరీజు వేసి ప్రశాంత్ కిశోర్ కొత్త పార్టీ ప్రకటన వెనుక కేసీఆర్ ఉన్నారని విశ్లేషణలు చేస్తున్నారు. కేసీఆర్ కూటములూ, ఫ్రంట్ లూ, పార్టీలూ కాదు, కొత్త జాతీయ అజెండా అన్న మాటల వెనుక అర్ధం ఇదే అయ్యుండొచ్చని భావిస్తున్నారు.

బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమి ప్రయత్నాలలో కేసీఆర్ కు పెద్దగా మద్దతు లభించని విషయం తెలిసిందే. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ ఆ తరువాత కాంగ్రెస్ తో కలిసి కూటమి అన్న పీకే ప్రతిపాదనలపై కూలంకషంగా చర్చించిన తరువాత కేసీఆర్ అందుకు సుముఖంగా స్పందించినట్లు చెబుతున్నారు. వచ్చే ఏన్నికలలో బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైతే తెరాసను కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు కూడా కేసీఆర్ అంగీకరించారని కూడా అంటున్నారు. అంతే కాకుండా వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ కు ఆరు రాష్ట్రాలలో ( తెలంగాణ కాకుండా) ఎన్నికల ఫండింగ్ చేయడానికి కూడా కేసీఆర్ ప్రతిపాదించారని అంటున్నారు. అయితే.. కేసీఆర్ ప్రతిపాదనలకు కాంగ్రెస్ స్పందన ఏమిటన్నది తెలియకపోయినా, కేసీఆర్ తెరవెనుక ఉండి బీజేపీ యేతర కూటమికి మద్దతు సమీకరించడానికి కొత్త పార్టీ పేర ప్రశాంత్ కిశోర్ ను తెరముందుకు తెచ్చారని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. `

మాటలొద్దు మంత్రిగారు చేతల్లో చూపండి!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు మొత్తంగా రాజధాని చుట్టూనే తిరుగుతున్నాయి. నిజానికి ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో ఎలాంటి వివాదం లేదు. అదొక వివాదమే కాదు. చట్ట పరంగా చూసినా, మరోల చూసినా, అమరావతి ఆంధ్ర ప్రదేశ్ ఏకైక రాజధాని.అందులో మరోమాటకు అవకాశమే లేదు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వం గెజిట్’లో ప్రకటించింది. న్యాయస్థానాలు తీర్పులిచ్చాయి. ఎనిమిదేల్లాకు పైగా, అకడి నుంచే పరిపాలన సాగుతోంది., ఏపీ ఏకైక రాజధాని అని చెప్పేందుకు ఇంకేమి కావాలి, అంటే, సమాధానం ఉండదు. ఒక విధంగా బీజేపీ వారి భాషలో చెప్పాలంటే, ప్రత్యేక హోదా వివాదం లానే, రాజధాని విషయం కూడా ముగిసిన అధ్యాయం.