English | Telugu

మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని విచారించిన పోలీసులు 

మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకాణిపై టిడిపి శ్రేణులు ఫైర్ అయ్యాయి. వెంకటాచలంలో టిడిపి నేతలు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఎపిలో వైసీపీ టిడిపి మధ్య నువ్వా నేనా అన్నట్టు తయారయ్యింది.గత వారం ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో కాకాణి హౌజ్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

మాటలొద్దు మంత్రిగారు చేతల్లో చూపండి!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు మొత్తంగా రాజధాని చుట్టూనే తిరుగుతున్నాయి. నిజానికి ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో ఎలాంటి వివాదం లేదు. అదొక వివాదమే కాదు. చట్ట పరంగా చూసినా, మరోల చూసినా, అమరావతి ఆంధ్ర ప్రదేశ్ ఏకైక రాజధాని.అందులో మరోమాటకు అవకాశమే లేదు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వం గెజిట్’లో ప్రకటించింది. న్యాయస్థానాలు తీర్పులిచ్చాయి. ఎనిమిదేల్లాకు పైగా, అకడి నుంచే పరిపాలన సాగుతోంది., ఏపీ ఏకైక రాజధాని అని చెప్పేందుకు ఇంకేమి కావాలి, అంటే, సమాధానం ఉండదు. ఒక విధంగా బీజేపీ వారి భాషలో చెప్పాలంటే, ప్రత్యేక హోదా వివాదం లానే, రాజధాని విషయం కూడా ముగిసిన అధ్యాయం.