English | Telugu
నిర్మలమ్మ పద్దు... వీటి ధరలు తగ్గుతాయ్!
Updated : Feb 1, 2025
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8వసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రధానంగా పేదలు, మహిళలు, యువత, రైతులకు ప్రయోజనం కలిగే అంశాలపై దృష్టి పెట్టారు. బడ్జెట్ సందర్భంగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పన్ను మినహాయింపులు అలాగే ఎగుమతి, దిగుమతులపై సుంకాల మార్పులు పలు వస్తువుల ధరలను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. ఈ నేపథ్యంలో పలు వస్తువుల ధరలు పెరుగుతాయి. మరికొన్ని తగ్గుతాయి
ధరలు తగ్గేవి:
క్యాన్సర్ మందులు
ప్రాణాలను రక్షించే మందులు
ఫ్రోజెన్ చేపలు
చేపల పేస్ట్
ఖనిజాలు
ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీలు
స్వదేశంలో తయారైన దుస్తులు
మొబైల్ ఫోన్లు
లెదర్ గూడ్స్
మెడికల్ ఎక్విప్ మెంట్