English | Telugu

దూకుడు పెంచిన ఎసిబి... ఎస్ నెక్స్ట్ కంపెనీకి నోటీసులు 

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఎసిబి దూకుడు పెంచింది. ఎస్ నెక్ట్స్ అనే కంపెనీకి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న ఎసిబి కార్యాలయంలో జరుగనున్నవిచారణకు రావాలని నోటీసులో పేర్కొంది.
ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడైన కెటీఆర్ తో బాటు చీఫ్ ఇంజినీర్ బిఎల్ఎన్ రెడ్డి , ఐఏఎస్ అరవింద్ కుమార్ లను ఎసిబి విచారణ చేసింది. ఫార్ములా ఈ రేస్ నిర్వహించడానికి ఎస్ నెక్స్ట్ కంపెనీ ఒప్పందం చేసుకుని సడెన్ గా వైదొలగింది.

మాటలొద్దు మంత్రిగారు చేతల్లో చూపండి!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు మొత్తంగా రాజధాని చుట్టూనే తిరుగుతున్నాయి. నిజానికి ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో ఎలాంటి వివాదం లేదు. అదొక వివాదమే కాదు. చట్ట పరంగా చూసినా, మరోల చూసినా, అమరావతి ఆంధ్ర ప్రదేశ్ ఏకైక రాజధాని.అందులో మరోమాటకు అవకాశమే లేదు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వం గెజిట్’లో ప్రకటించింది. న్యాయస్థానాలు తీర్పులిచ్చాయి. ఎనిమిదేల్లాకు పైగా, అకడి నుంచే పరిపాలన సాగుతోంది., ఏపీ ఏకైక రాజధాని అని చెప్పేందుకు ఇంకేమి కావాలి, అంటే, సమాధానం ఉండదు. ఒక విధంగా బీజేపీ వారి భాషలో చెప్పాలంటే, ప్రత్యేక హోదా వివాదం లానే, రాజధాని విషయం కూడా ముగిసిన అధ్యాయం.