English | Telugu

యువకుడి ఆత్మహత్యకు రివెంజ్.. యువతిపై సామూహిక అత్యాచారం

ఓ యువకుడి ఆత్మహత్యకు కారకురాలైందని ఆ యువకుడి కుటుంబ సభ్యులు ఓ యువతిపై అత్యంత క్రూరంగా రివెంజ్ తీర్చుకున్నారు. ఆమెను కిడ్నాప్‌ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై జుట్టు కత్తిరించి, ముఖానికి నలుపు రంగు పూసి ఊరేగించారు. ఢిల్లీలోని కస్తూర్బా నగర్‌లో ఈ ఏడాది జనవరి నెలలో జరిగిన ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేసి ఛార్జీషీటును మంగళవారం కోర్టుకు సమర్పించారు. 21 మందిపై దాఖలైన చార్జిషీట్లో 12 మంది మహిళలు, నలుగురు పురుషులు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. నిందితుల నుంచి యువతికి సంబంధించిన 26 వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో పన్నెండు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా, మరో పధ్నాలుగు వీడియోలు నిందితుల మొబైల్స్‌ లో ఉన్నట్లు చార్జిషీట్ లో పోలీసులు పేర్కొన్నారు. ఢిల్లీకి చెందిన ఓ యువకుడు.. బాధితురాలిని ప్రేమ పేరిట వేధింపులకు గురి చేశాడు. ప్రేమించాలని వెంట పడ్డాడు. కానీ అతని ప్రేమను ఆమె తిరస్కరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో సదరు యువకుడు గత ఏడాది నవంబర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతని ఆత్మహత్యకు ఈ యువతే కారణమని మృతుడి కుటుంబ సభ్యులు కక్ష కట్టి ఈ ఏడాది జనవరిలో కిడ్నాప్‌ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతే కాకుండా ఆమె జుట్టు కత్తిరించి, ముఖానికి బ్లాక కలర్‌ పూసి, మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు.

మాటలొద్దు మంత్రిగారు చేతల్లో చూపండి!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు మొత్తంగా రాజధాని చుట్టూనే తిరుగుతున్నాయి. నిజానికి ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో ఎలాంటి వివాదం లేదు. అదొక వివాదమే కాదు. చట్ట పరంగా చూసినా, మరోల చూసినా, అమరావతి ఆంధ్ర ప్రదేశ్ ఏకైక రాజధాని.అందులో మరోమాటకు అవకాశమే లేదు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వం గెజిట్’లో ప్రకటించింది. న్యాయస్థానాలు తీర్పులిచ్చాయి. ఎనిమిదేల్లాకు పైగా, అకడి నుంచే పరిపాలన సాగుతోంది., ఏపీ ఏకైక రాజధాని అని చెప్పేందుకు ఇంకేమి కావాలి, అంటే, సమాధానం ఉండదు. ఒక విధంగా బీజేపీ వారి భాషలో చెప్పాలంటే, ప్రత్యేక హోదా వివాదం లానే, రాజధాని విషయం కూడా ముగిసిన అధ్యాయం.