ఏపీలోతల్లి కాంగ్రెస్’తో పిల్ల కాంగ్రెస్ పొత్తు.. పీకే ప్లాన్ ..
ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిశోర్’ వయసు ఉంటే ఓ 40 ఏళ్ళు ఉండవచ్చును. 2014 సార్వత్రిక ఎన్నికలకు ఒకటి రెండు సంవత్సరాల ముందు, 2012 ఆ ప్రాంతంలో ఆయన ఎన్నికల వ్యూహకర్తగా దేశానికి పరిచయం అయ్యారు. అంటే, ఓ దశాబ్ద కాలంగా మాత్రమే దేశ రాజకీయాలలో ఆయన పేరు వినిపిస్తోంది.నిజానికి గత సంవత్సరం జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాతనే ఆయన బ్రాండ్ ఇమేజ్ బాగా పెరిగి పోయింది. ఇంతలోనే పీకే, ఇంతింతై ..అన్నట్లుగా ఎదిగిపోయారు. ఎంతగా అంటే, కురువృద్ధ కాంగ్రెస్ పార్టీ మొదలు, వైసీపీ, తృణమూల్. ఎన్సీపీ వంటి పిల్ల కాంగ్రెస్ పార్టీలు అలాగే, తెరాస, డీఎంకే వంటి ప్రాంతీయ, కుటుంబ పార్టీలు... ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న లౌకికవాద పార్టీలన్నీ క్యూకట్టి మరీ పీకేని శరణు వేడుతున్నాయి.