English | Telugu
ఆ తల్లి ప్రేమ ఆకాశమంత!
Updated : Jul 19, 2022
ఫ్లారిడాకి చెందిన స్కాట్, కోరి ల పిల్లవాడు మాథ్యూ. పిల్లాడు ఊహించనివిధంగా పదకండేళ్లకే కనుమూశాడు. వారి దుఖానికి అంతే లేదు. వాడికి అంతరిక్షం, చందమామ గురించి తెలుసుకోవడం మహా సరదాట. వాడు మమ్మల్ని విడిచి చందమామతో ఉండడానికే ముందుగా వెళిపోయాడు.. అంటున్నారు మాథ్యూ బంధుగణం. అయితే వాడి చితాభస్మం పంపితే మేము వాడిని పంపినట్టవుతుందని ఆ తల్లిదండ్రులు భావిస్తున్నారు.
అయితే అలా మనిషి అయినా, చితాభస్మం పంపించాలన్నా చాలా కష్టం. దానికి భరించలేని ఖర్చవుతుంది. కానీ మాథ్యూ పట్ల ఆ తల్లిదండ్రుల ప్రేమ కంటే అదేమంత పెద్ద ఖర్చుకాదు. కోరీ మాత్రం ఆమె బంధువులు, స్నేహితులు చెప్పినట్లు ఆర్దిక సహాయం చేసేవారిని తిరస్కరించవద్దనే అనుకుంది. నాసా వారి స్పేస్ ఎక్స్‌లో పంపడానికి ఏర్పాట్ల గురించి నెట్‌లో సమాచా రాన్ని సేకరించింది. సంబంధిత అధికారులను కలిసింది. లూనా ప్లయిట్‌లో పంపాలని నిశ్చయించుకున్నారు. కానీ దానికి 12,500 డాలర్లు అవుతుంది. ఆ సంగతి తెలుసుకుని మాథ్యూ బంధువులు, స్నేహితులు, కోరి దంపతుల స్నేహితులు అందరూ తోచినంత ఎక్కువగానే సహాయం చేశారు.
ఇప్పటికి 14వేల డాలర్లు సమకూరాయి. ఫ్లయిట్ వచ్చే ఏడాది వెళుతుంది. మా పిల్లవాడి బంగారు కల వచ్చే ఏడాది ఫలించనుంది అని స్కాట్ అందరితో చెబుతున్నాడు. అన్ని సన్నద్ధం చేశారు. చితాభస్మాన్ని పంపడమంటే పిల్లాడి ఆశలు ఫలించినట్టేనని కోరీ అన్నది. ఇంతకంటే ఏ తల్లీ ప్రేమను ప్రకటించలేదేమో!