English | Telugu

ఆ ద‌ర్శ‌కుడు దివాళా తీసేశాడు

ఒక్క సినిమా చాలు.. జీవితాల్ని త‌ల‌కిందులు చేయ‌డానికి. అలాంటిది వైవిఎస్ చౌద‌రికి దెబ్బ మీద దెబ్బ‌లు ప‌డ్డాయి. ఒక‌టా రెండా? వ‌రుస ప‌రాజ‌యాలు ఉక్కిరి బిక్కిరి చేశాయి. చిన్న సినిమాల‌తో పెద్ద ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకొన్న చౌద‌రికి ఈమ‌ధ్య కాలంలో ఊహించ‌ని భారీ ప‌రాజ‌యాలు వెన్నాడాయి. మ‌రీ ముఖ్యంగా.. రేయ్ సినిమా ఆయ‌న ఆశ‌ల్ని ఆవిరి చేసింది. ఓ కొత్త కుర్రాడితో రూ.30 కోట్లు పెట్టి, మూడేళ్లు సినిమా తీశారు.

ఆ సినిమాతో ఏకంగా రూ.20 కోట్ల న‌ష్టాలు వాటిల్లాయి. వాటి నుంచి వైవిఎస్ ఇంకా తేరుకోలేదు. బ్యాంకుల నుంచి తెచ్చుకొన్న అప్పులు ఇప్పుడు చౌద‌రిని వెంటాడుతున్నాయి. రేయ్ కోసం ఉన్న ఆస్తుల్ని అమ్ముకొన్న చౌద‌రి.. ఇప్పుడు చేతిలో ఉన్న ఒక్క థియేట‌ర్‌నీ వ‌దులుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. గుడివాడ‌లో చౌద‌రికి ఓ థియేట‌ర్ ఉంది. అది కాస్త అప్పుల్లో ఉంది. వ‌డ్డీలు కూడా చెల్లించ‌లేని ప‌రిస్థితిలో ఉన్నాడు చౌద‌రి. దాంతో స‌ద‌రు బ్యాంకు వాళ్లు ఆ థియేట‌ర్‌ని సీజ్ చేసేశారు. దాంతో ఇప్పుడు ఈ ద‌ర్శ‌కుడు టోట‌ల్‌గా జీరో అయిపోయాడు. 'డ‌బ్బుల‌న్నీ సినిమాల ద్వారా సంపాదించుకొన్న‌దే. సినిమాల‌తోనే పోయింది. మ‌ళ్లీ సంపాదించుకొంటా' అని న‌మ్మ‌కంగా చెబుతున్న చౌద‌రికి మ‌ళ్లీ మంచి రోజులు ఎప్పుడొస్తాయో??

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.