English | Telugu

మూడు సినిమాలు ఢీకొడుతున్నాయి..

ఈ శుక్రవారం మూడు సినిమాలు రిలీజ్ కు ముస్తాబయ్యాయి. వంశీ వెన్నెల్లో హాయ్ హాయ్, కళ్యాణ వైభోగమే,స్పీడున్నోడు థియేటర్లలో తలపడబోతున్నాయి. వీటిలో మొదటి రెండూ చిన్న సినిమాలు కాగా, ' స్పీడున్నోడు' కు మాత్రం ఎక్కువగానే బడ్జెట్ పెట్టారు.ఈ మూడింటి గురించి ఒకసారి చూస్తే...

' వంశీ వెన్నెల్లో హాయ్ హాయ్ మూవీ ' చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తయినా,రిలీజ్ మాత్రం వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా రేపు రిలీజ్ కాబోతోంది. ' ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు ' లోని పాటనే సినిమాకు టైటిల్ గా పెట్టారు దర్శకుడు వంశీ. మొదట ' తను మొన్నే వెళ్లిపోయింది ' అని టైటిల్ పెట్టి ఆ తర్వాత ' మెల్లగా తట్టింది మనసు తలుపు ' అని మార్చి, చివరికి తన సినిమా పాటలోని మాటనే టైటిల్ గా ఫిక్స్ అయ్యారు వంశీ. 'రంగం' ఫేం అజ్మల్, నికితా నారాయణ్ ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా చేస్తున్నారు.


' అలా మొదలైంది ' తో సక్సెస్ చూసిన నందినీ రెడ్డి దర్శకత్వంలో, ' ఊహలు గుసగుసలాడే' తో సక్సెస్ మెట్టు ఎక్కిన నాగశౌర్య హీరోగా వస్తున్న సినిమా కళ్యాణ వైభోగమే.ఈ ఇద్దరికీ ఇప్పుడు సక్సెస్ చాలా కీలకం కావడంతో, ఈ సినిమాపై రిజల్ట్ పైనే వీరి ఆశలున్నాయి.నాగశౌర్యకు జతగా, ' ఎవడే సుబ్రహ్మణ్యం ' భామ మాళవికా నాయర్ నటిస్తోంది


తన మొదటిసినిమా ' అల్లుడు శీను' తో సక్సెస్ ను సొంతం చేసుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రెండో ప్రయత్నంగా ' స్పీడున్నోడు ' గా వస్తున్నాడు. భీమనేని దర్శకనిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే, భారీగా థియేటర్లు కూడా దక్కించుకుంది. కామెడీ నుంచి మాస్ డైరెక్టర్ గా మారాలనుకుంటున్న భీమనేనికి, ద్వితీయ విఘ్నాన్ని దాటడానికి బెల్లంకొండ సాయికి, ఈ సినిమా రిజల్ట్ చాలా కీలకంగా మారింది.

సినిమా అనేది ఎప్పుడూ బడ్జెట్ వల్లో, స్టార్ కాస్ట్ వల్లో హిట్ కాదు.విషయముంటే ఏ సినిమానైనా ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు.మరి రేపు ఢీకొంటున్న ఈ మూడు సినిమాల్లో విజేత ఎవరు..? చూద్దాం..

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.