Read more!

English | Telugu

దీపికా పదుకునే ' xXx '

బాలీవుడ్ హీరోయిన్స్ ఒక్కొక్కరిగా, హాలీవుడ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఐశ్వర్యరాయ్ ' ది పింక్ పాంథర్ 2 ' తో, ప్రియాంక చోప్రా ' క్వాంటికో ' టీవీ సీరీస్ తో  హాలీవుడ్ లో అడుగుపెట్టారు. ఇప్పుడు ఈ జాబితాలో దీపికా పదుకునే చేరింది.

ఈ మధ్యే దీపిక తన ట్విట్టర్లో గుండుతో ఉన్న వ్యక్తిని వెనకవైపునుంచి చూపిస్తూ, ఇతను విన్ డీజిల్ అని ఫోటో పెట్టిన సంగతి తెలిసిందే. అప్పటికి దీపిక హాలీవుడ్ లో నటిస్తోంది అన్న గుసగుసలు మాత్రమే వినబడ్డాయి. ఆ తర్వాత దాన్ని కన్ఫామ్ చేసింది దీపిక. హాలీవుడ్ స్టార్ విన్ డీజిల్ ' xXx - ది రిటర్న్ ఆప్ శాండర్స్ కేజ్ 'లో దీపిక పదుకునే నటిస్తోంది . ఇఫ్పటికే ఈ షూటింగ్ కోసం ఆమె టోరంటో చేరుకుంది. షూటింగ్ సెట్స్ లో తీసిన ఫస్ట్ లుక్ ను తన ట్విట్టర్లో రిలీజ్ చేశాడు విన్ డీజిల్. సినిమాలో దీపిక పేరు సెరీనా. ఇప్పటికే xXx సీరీస్ లో రెండు సినిమాలు రాగా, దీపిక నటిస్తున్న భాగం మూడోది. మరి దీపికను హాలీవుడ్ ఎలా రిసీవ్ చేసుకుంటుందో చూడాలి.