English | Telugu
జనతాగ్యారేజ్ సెట్ లో అభయ్ రామ్ సందడి..!
Updated : May 10, 2016
హైదరాబాద్ లో ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా సెట్లో, ఒక చిట్టి అతిథి సందడి చేశాడు. మూవీ యూనిట్ కు ఆ అతిథి రాకతో కొత్త ఎనర్జీ వచ్చింది. విషయంలోకి వెళ్తే, ఎన్టీఆర్ భార్య ప్రణతి తనయుడు అభయ్ రామ్ ను తీసుకుని సిటీలోని షూటింగ్ జరుపుకుంటున్నజనతాగ్యారేజ్ సెట్ కు వెళ్లారు. చిన్న ఎన్టీఆర్ కు పుట్టిన చిన్నోడు రాగానే సెట్ లోని వాతావరణం అంతా సందడిగా మారిపోయింది.
అక్కడున్న సెట్ ప్రాపర్టీస్, సాంకేతిక పనిముట్లు అన్నింటినీ క్లియర్ గా అబ్జర్వ్ చేశాడు అభయ్ రామ్. షూటింగ్ సెట్లో ఉన్న సమంత కూడా చిట్టి రాముడిని కాసేపు ముద్దాడి ఆడించింది. ప్రస్తుతం అభయ్ రామ్ జనతాగ్యారేజ్ సెట్లో చేసిన సందడి ఫోటోలన్నీ సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో షేర్ అవుతున్నాయి. యంగ్ టైగర్ ఫ్యాన్స్ అంతా, తమ హీరో కొడుకును చూసి మురిసిపోతున్నారు.
కాగా, కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న జనతాగ్యారేజ్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టి మరీ గ్యారేజ్ సెట్ ను వేశారు. సారథీ స్టూడియోస్ లో వేసిన ఈ సెట్లోనే మెజారిటీ షూటింగ్ జరుగుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగష్ట్ 12న రిలీజ్ అవబోతోంది. సమంత హీరోయిన్ గా చేస్తుండగా మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషిస్తున్నారు.