English | Telugu
నితిన్‌ని కాపాడిన సూపర్‌స్టార్ రజనీ..!
Updated : May 10, 2016
సూపర్‌స్టార్ రజనీకాంత్ తెలుగు హీరో నితిన్‌ని కాపాడటమేంటి అనుకుంటున్నారా? ఏం లేదండి..రజనీ హీరోగా తెరకెక్కిన కబాలీ చిత్రం విడుదల వాయిదా పడింది. అందుకే నితిన్ బతికిపోయాడు. అఖిల్‌ను ఇంట్రడ్యూస్ చేస్తూ నిర్మించిన అఖిల్ సినిమా అట్టర్‌ప్లాప్ కావడంతో నితిన్ ఆర్ధికంగా చాలా నష్టపోయాడు. ఇదిలా ఉంటే నితిన్ చివరి రెండు సినిమాలు అట్టర్‌ఫ్లాప్ అయి నితిన్‌ను మరింత కష్టాల్లోకి నెట్టాయి. ప్రజంట్ త్రివిక్రమ్ దర్శకత్వంలో "అఆ" చేస్తున్నాడు. ఆ సినిమాను జూన్ 3న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే అదే రోజు కబాలీ కూడా రిలీజ్ అవుతుందని టెన్షన్ పడింది చిత్రయూనిట్. అయితే అనుకోకుండా కబాలీ వాయిదా పడటంతో నితిన్ తెగ ఖుషి అవుతున్నాడు.