English | Telugu
యంగ్ టైగర్ పాట రిలీజ్ కు రెడీ
Updated : Mar 6, 2016
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటుడే కాదు. మంచి సింగర్ కూడా. మొన్న వచ్చిన నాన్నకు ప్రేమతో సహా, కంత్రి, అదుర్స్, రభస సినిమాల్లో తన గొంతు సవరించాడు. లేటెస్ట్ గా ఎన్టీఆర్ పాడిన ఒక పాట రిలీజ్ కు రెడీగా ఉంది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన చక్రవ్యూహ సినిమా కోసం ఒక పాటను పాడాడు ఎన్టీఆర్. కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ తనయుడైన పునీత్ ఇండస్ట్రీకి వచ్చి పాతికేళ్లయింది. ఈ సందర్భంగా కాస్త స్పెషల్ గా ఉండాలని చక్రవ్యూహలో, ఎన్టీఆర్ తో పాట పాడించింది మూవీ టీం. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. గతంలోనే తమన్ సంగీత సారథ్యంలో, రభసలో పాడాడు ఎన్టీఆర్. దీంతో పెద్దగా ఇబ్బంది పడకుండా చక్రవ్యూహకు కూడా చెలరేగిపోయాడని సమాచారం. ఈ సినిమా ఆడియో మార్చి 8 న రిలీజ్ అవనుంది. సినిమాకు ఎన్టీఆర్ పాడిన పాట హైలెట్ గా ఉండబోతోందని ఇన్ సైడ్ టాక్..