English | Telugu
సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ లేదా..?
Updated : Mar 6, 2016
సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో రిలీజ్ అమరావతిలో చాలా గ్రాండ్ గా జరగబోతోందని, దీనికి మెగా బ్రదర్స్ వస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ సర్దార్ కు అసలు ఆడియో ఫంక్షనే వద్దని మూవీ టిం అనుకుంటున్నారంటూ, కొత్త టాక్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఆడియో ఫంక్షన్ అనేది, కేవలం సినిమా ప్రచారం కోసం, జనంలోకి తీసుకెళ్లడం కోసం నిర్వహిస్తారు. సర్దార్ కు ఇప్పటికే కావాల్సినంత ప్రచారం ఉంది. సినిమా రిలీజైతే, టాక్ తో సంబంధం లేకుండా, నిర్మాతను సేఫ్ జోన్ కు చేర్చేసే మార్కెట్ పవన్ కుంది. దీంతో ఆడియో ఫంక్షన్ పెట్టినా, పెట్టకపోయినా ఒకటే అని పవన్ అనుకుంటున్నారట. అసలే డెడ్ లైన్ మీట్ అవడం కోసం కష్టాలు పడుతున్న మూవీ టీంతో ఆడియో ఫంక్షన్ పెట్టి టైం వేస్ట్ చేయించడం పవన్ అండ్ కో కు ఇష్టం లేదన్న వార్తలు వస్తున్నాయి. మరి పవన్ ఏం చేస్తారో చూడాలి.