English | Telugu

రొమాన్స్ చేస్తూ.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది!

యామీ గౌత‌మ్ తెలుసు క‌దా?? మొన్నే తెలుగులో కొరియ‌ర్ బోయ్ క‌ల్యాణ్ అనే సినిమా చేసింది. అంత‌కు ముందు ఒక‌ట్రెండు సినిమాల్లో న‌టించినా పాప‌కు బ్రేక్ రాలేదు. ఆ మూడు సినిమాల్లోనూ ప‌ద్ధ‌తిగానే క‌నిపించింది. అయితే బాలీవుడ్ లో మాత్రం ఈ పాప హాట్ జెమ్‌. లిప్ లాక్ స‌న్నివేశాల్లో విచ్చ‌ల‌విడిగా న‌టించేస్తుంది. కెమెరా ముందే కాదు, వెనుకా.. హీరోతో రొమాన్స్ చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింద‌ట‌. ప్ర‌స్తుతం యామీ ‘స‌న‌మ్ రే’ అనే హిందీ చిత్రంలో న‌టిస్తుంది.

ఇందులో పుల్కిట్ సామ్రాట్ హీరో.షూటింగ్ స‌మ‌యంలో వీరి మ‌ధ్య స్నేహం కాస్తా ప్రేమ‌గా మారింద‌ట‌. ఇద్ద‌రూ చ‌నువుగా మెలుగుతున్నార‌ట‌. కార్ వ్యాల్‌లోనూ... గంట‌ల త‌ర‌బ‌డి గ‌డుపుతున్నార‌ట‌. అయితే పుల్కిట్‌కి ఆల్రెడీ పెళ్ల‌యింది. పుల్కిట్ స‌తీమ‌ణికి యామీ విష‌యంలో అనుమానం మొద‌లైంది. అందుకే మొన్నామ‌ధ్య స‌డ‌న్‌గా సెట్‌కి వెళ్లింద‌ట‌. లొకేష‌న్లో ఉండాల్సిన హీరో హీరోయిన్లు కేర్ వ్యాన్‌లో సేద‌తీరుతున్నార‌ట‌. ఆమె వెళ్లేస‌రికి... హీరో హీరోయిన్లు ఇద్ద‌రూ స‌ర‌స క‌ల్లాపాల్లో సాగుతున్నార‌ట‌.

దాంతో ఇద్ద‌రూ... రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. దాంతో... పుల్కిట్ శ్రీ‌మ‌తి గ‌గ్గోలు పెట్టింద‌ట‌. సెట్లో అర‌చి గీ పెట్టింద‌ట‌.. యామికి గ‌ట్టిగా వార్నింగ్ ఇచ్చి మ‌రీ వెళ్లింద‌ని తెలుస్తోంది. దాంతో కొన్ని రోజుల నుంచి యామీ షూటింగ్‌కి కూడా రావ‌డం లేద‌ట‌. ఈ విష‌యాన్ని ఇంత‌టితో వ‌దిలిపెట్ట‌న‌ని యామీ ప‌రువు తీస్తాన‌ని పుల్కిట్ భార్య బెదిరిస్తోంది. పాపం.. యామీ... అడ్డంగా బుక్క‌యిపోయింది క‌దూ!

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.