English | Telugu

మహేష్ మనసులో మాట!!

టాలీవుడ్ లో బాలీవుడ్ హీరోలకు ధీటుగా పోటీనిచ్చే హీరో ఎవరంటే ప్రిన్స్ మహేష్ బాబు అని చెప్పాలి. అందంలో గాని, క్రేజ్ లో గానీ బాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తీసిపోని ఛరిష్మా ప్రిన్స్ ది. అందుకనే ప్రతి హీరోయిన్ ప్రిన్స్ పక్కన ఒక్క ఛాన్స్ కోసం వెయిటింగ్ చేస్తూ వుంటారు. అలాగే ప్రిన్స్ కి లేడీ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అతడి ఆటోగ్రాప్ కోసం ఎంతో మంది యువతులు పోటీపడుతూ వుంటారు. మరి ఇంతమంది మగువలు ఇష్టపడే మహేష్ కి ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా? దీపిక పదుకొనే అంటా!! షాక్ కి గురవ్వకండీ..ఇది నిజమే. ఒకప్పుడు శ్రీదేవిని ఎక్కువగా ఇష్టపడే మహేష్ కి ప్రస్తుతం దీపిక అంటే పిచ్చపిచ్చగా ఇష్టమట. దీపిక బ్రిలియంట్ యాక్ర్టెస్. పికూ మూవీలో తన యాక్టింగ్ సూపర్భ్... అంటూ పొగిడేశాడు. అంతకుమించి అందగత్తె.. అంటూ తన మనసులో మాటను బయటపెట్టేసాడు. మరి మహేష్ ఎలాగే మనసులో మాట బయటపెట్టాడు కాబట్టి త్వరలో వీరిద్దరూ కలిసి రొమాన్స్ చేసే అవకాశం వుందేమో చూద్దాం!!

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.