English | Telugu

అప్పుడు గబ్బర్ సింగ్.. ఇప్పుడు ఓజీ.. హిస్టరీ రిపీట్స్!

తెలుగునాట తిరుగులేని ఫాలోయింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సొంతం. కెరీర్ స్టార్టింగ్ లోనే డబుల్ హ్యాట్రిక్ హిట్స్ తో సంచలనాలు సృష్టించారు. యూత్ లో మరెవరికి సాధ్యం కానీ క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి వంటి సినిమాలు ఒక దానిని మించి ఒకటి హిట్ అయ్యి.. పవన్ కళ్యాణ్ ని తిరుగులేని స్టార్ గా మార్చాయి. ముఖ్యంగా 'ఖుషి' సినిమా, అప్పటిదాకా ఉన్న రికార్డులన్నీ తిరగరాసింది. అయితే ఖుషి తర్వాత మళ్ళీ పవన్ కి ఆ స్థాయి హిట్ రావడానికి చాలా సమయం పట్టింది. 11 ఏళ్ళ పాటు ఎన్నో పరాజయాలు పలకరించాయి. మధ్యలో 'జల్సా' హిట్ అయినప్పటికీ, అది అభిమానుల ఆకలిని పూర్తిస్థాయిలో తీర్చలేకపోయింది. (Pawan Kalyan)

'ఖుషి' తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకలి తీర్చిన సినిమా 'గబ్బర్ సింగ్' అని చెప్పవచ్చు. ఈ సినిమాకి పవన్ అభిమాని హరీష్ శంకర్ దర్శకుడు. ఫ్యాన్స్ పల్స్ తనకంటే ఎక్కువ ఎవరికీ తెలియదు అన్నట్టుగా.. ఇందులో పవన్ కళ్యాణ్ ని చూపించాడు హరీష్. పవన్ స్క్రీన్ ప్రజెన్స్, మ్యానరిజమ్స్, డైలాగ్ లు, డ్యాన్స్ లు.. ఇలా ప్రతి అంశం ఫ్యాన్స్ ని కట్టిపడేసింది. అందుకే 'గబ్బర్ సింగ్' ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు మళ్ళీ 13 ఏళ్ళ తర్వాత 'ఓజీ' సినిమాకి 'గబ్బర్ సింగ్' వైబ్స్ కనిపిస్తున్నాయి. (They Call Him OG)

'గబ్బర్ సింగ్' తర్వాత పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'అత్తారింటికి దారేది' వంటి ఇండస్ట్రీ హిట్ ఉన్నప్పటికీ.. ఓ అదిరిపోయే యాక్షన్ సినిమాతో ఆయన బాక్సాఫీస్ ని షేక్ చేయాలనేది అభిమానుల కోరిక. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా పవన్ పాలిటిక్స్ తో బిజీగా ఉండటంతో.. ఆయన స్టార్డంకి తగ్గ సరైన సినిమా రాలేదనే అభిప్రాయం వారిలో ఉంది. ఇప్పుడు అభిమానుల ఆకలి తీర్చడానికి అన్నట్టుగా 'ఓజీ' వస్తోంది. ఈ చిత్ర దర్శకుడు సుజీత్ కూడా పవన్ కి వీరాభిమాని కావడం విశేషం. పవన్ కళ్యాణ్ అభిమానులు తమ హీరోని ఎలా చూడాలని ఇన్నేళ్ళుగా ఎదురుచూస్తున్నారో.. సుజీత్ అలా చూపిస్తున్నాడని ప్రచార చిత్రాలతోనే అర్థమైపోయింది. పవన్ లుక్, స్క్రీన్ ప్రజెన్స్, డైలాగ్ డెలివరీ.. ప్రతిదీ ఫ్యాన్స్ ని కట్టిపడేసేలా ఉంది. ఇప్పటికే ఓజీపై భారీ అంచనాలు ఉన్నాయి. బుకింగ్స్ కి కూడా ఓ రేంజ్ రెస్పాన్స్ వస్తోంది. టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ లోనే రూ.200 కోట్ల గ్రాస్ రాబట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక హిట్ టాక్ వస్తే.. ఫుల్ రన్ లో ఏ స్థాయి వసూళ్లు రాబడుతుందో ఊహలకు కూడా అందదు.

అప్పుడు 'గబ్బరి సింగ్'తో పవన్ కళ్యాణ్ అభిమానులు మెచ్చే సినిమాని హరీష్ అందించాడు. ఇప్పుడు 'ఓజీ'తో సుజీత్ కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తాడని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.