English | Telugu
నమ్మితే మరీ ఇంతలా నమ్మాలా చిరు!
Updated : Jan 1, 2023
మెగాస్టార్ చిరంజీవి చిత్రం అంటే సినిమా ప్రారంభం ముందునుంచే ఎన్నో బాధ్యతలు ఉంటాయి. సరైన కథను ఎంచుకోవడం, దాని ట్రీట్మెంట్ చిరుకి నచ్చేలా మార్చడం, ఆ కథను చిరు ఇమేజ్‌కి తగ్గట్లుగా మలచడం, మార్పులు చేర్పులు చేయడం, చిరు నుంచి అభిమానులు ఏమి కోరుకుంటున్నారో.. చిరంజీవిలోని అసలు ప్లస్ పాయింట్స్ ఏమిటో వాటిని హైలైట్ చేస్తూ కథను తీర్చిదిద్దుకోవడం చాలా ప్రధానం. ఈ విషయంలో చిరు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మెగాస్టార్ చిరంజీవికి కథ చెప్పి ఒప్పించడం అనేది అంత ఆషామాషీ విషయం కాదు. 150 సినిమాలు అనుభవం ఉన్న ఆయన ఒక కథ వినగానే అది హిట్ అవుతుందా లేదా అని ఇట్టే చెప్పగల అనుభవజ్ఞులు. డైరెక్టర్ కి ఎంత క్యాలిబర్ ఉన్నా కథలో దమ్ము లేకపోతే వేస్ట్ అని చిరు నమ్మకం. అందుకే ఆయన అలాంటి ఇలాంటి డమ్మీ కథలను ఒప్పుకోరు. డమ్మి కథలతో గతంలో ఆయన పలు చేదు అనుభవాలు కూడా పొందారు. అందుకే చిరు సినిమా అంటే కథ ఏంటి అంటుంటారు. కానీ వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబి జస్ట్ ఒక లైన్ చెప్పి చిరు వద్ద ఓకే చేయించుకున్నారట.
ఒకవైపు చూస్తే కొరటాల శివ వంటి దర్శకుడు చిరంజీవిని తీవ్రంగా నిరాశపరిచారు. అంతకు ముందు వరుసగా ఆయనను మురుగదాస్ నుంచి కొరటాల శివ వరకు దర్శకులందరూ నిరాశ పరుస్తూనే వస్తున్నారు. మధ్యలో ఏదో కాస్త రీమేక్ మూవీ అయినా ఖైదీ నెంబర్ 150 ని వినాయక బాగానే మలిచినప్పటికీ ఆ తర్వాత వచ్చిన చిత్రాలు మరలా నిరాశపరిచాయి. మెగా అభిమాని అయిన బాబి చిరుతో సినిమా అనగానే ఆయన దగ్గరకు వచ్చి ఒక లైన్ చెప్పాడట. కేవలం క్యారెక్టర్ చెప్పి సినిమా ఓకే చేయించారట. ఫస్టాఫ్ వరకు స్టోరీ చెప్పగా ఇందులో కథ ఏది? అని అన్నారట చిరంజీవి. అయితే కొద్దిగా గ్యాప్ తీసుకుని రవితేజ పాత్రను జోడించి ఫైనల్ గా ఫుల్ స్క్రిప్ట్ వినిపించాడని....అలా వాల్తేరు వీరయ్య కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. ఈ విషయాన్ని బాబికూడా తెలియజేశారు. స్వతహాగా రైటర్ కావడం వలన సినిమాలు ఎలా తీసుకెళ్తే బాగుంటుంది అనేది బాబీకి ఒక ఐడియా ఉంటుంది. అందులోనూ ఆయన చిరుకి వీరాభిమాని. ఆ ఆలోచన సమయంలో ఆయనకు చిరు సినిమాపై ఓ ఐడియా వచ్చి... సినిమాని చిరుకి చెప్పడం ఆయన ఓకే చేయడం జరిగిపోయాయట.
ఇక తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో చిరంజీవి వాల్తేరు వీరయ్య రొటీన్ స్టోరీ నే అని చెప్పడం విశేషం. కానీ సినిమాలో సీన్స్, ఎమోషన్స్ చాలా బాగుంటాయని ఆయన చెప్పుకొచ్చారు. ఫ్లోలో రవితేజ పాత్ర సెకండ్ హాఫ్ లో ఉంటుందని కూడా లీక్ చేశారు. ఈ లీకులు చేయడం వల్ల సినిమా మీద ఉన్న ఇంపాక్ట్ కాస్త దెబ్బ తినే అవకాశం ఉంది. ఇక దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందట. శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన వాల్తేరు వీరయ్య లో 'బాస్ పార్టీ' అనే స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతాలా కనిపించి స్టెప్పు లేసింది. మరి వాల్తేరు వీరయ్య రిజల్ట్ తెలియాలంటే జనవరి 13 వరకు వెయిట్ చేయాలి. చిరు గెస్సింగ్ కరెక్టేనా అనేది చిత్రం విడుదలైతే గానీ తెలియదు. కేవలం సీన్స్, ఎమోషన్స్, ఎలివేషన్స్ బాగున్నాయని చిరు ఈ చిత్రాన్ని ఓకే చేయడం కరెక్టేనా కాదా? కేవలం క్యారెక్టరైజేషన్ ని చూసి సినిమా ఓకే చేయడం ఎలాంటి ఫలితాన్ని అందించింది అనేవన్నీ త్వరలో తేలిపోతాయి.