English | Telugu
ఆమెకు అఖిల్ ఎవరో తెలియదట
Updated : Jun 12, 2014
యంగ్ హీరోల ఎంట్రీలపై క్రేజ్ ఉంటుంది. ఇక వచ్చేది అక్కినేని ఇంటి వారసుడు అయితే ఇక చెప్పేదేముంది. అక్కినేని అఖిల్ మనం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చినప్పటికీ, పూర్తి స్థాయి హీరోగా ఏ సినిమాలో కనిపించబోతున్నాడనే విషయం మీద ఆసక్తి రోజు రోజుకి పెరిగిపోతోంది. అఖిల్ సినిమాను డైరెక్ట్ చేయబోయేది ఎవరు, హీరోయిన్ గా ఎవరిని తీసుకోబోతున్నారనే అంశాల పై రోజుకో కథనం వినపిస్తునే వుంది. తాజాగా అఖిల్ పక్కన బాలీవుడ్ భామ అలియా భట్ హీరోయిన్‌గా కనిపించబోతుందని ఒక ఆంగ్ల పత్రికలో వార్తలు వచ్చాయి. ఈ విషయం ముంబాయి మీడియాలో కూడా పాపులర్ అయింది. వారు అలియానే నేరుగా ఈ దీని గురించి అడిగారట. అంతే, అసలు అఖిల్ ఎవరో నాకు తెలియదు. మొదటి సారి ఆ పేరు వింటున్నాను, అని చిరుబుర్రులాడిందట అలియా. అంతే కాదు, అఖిల్‌తో తానే చిత్రం చేయట్లేదని నిర్దారించింది.
ఇదిలా వుండగా అఖిల్ పక్కన అవికా గౌర్ నటిస్తుందని మొదటి నుంచి అంటున్నారు. ఉయ్యాలా జంపాల సినిమా తర్వాత అన్నపూర్ణ సంస్థ ఆమెతో మరో చిత్రం కూడా ఒప్పందం కుదుర్చుకున్నారని కూడా కథనాలు వినిపించాయి. దీంతో అఖిల్ మొదటి చిత్రంలో అవికానే హీరోయిన్ అనే ప్రచారం మొదలయింది. అలియా కాదంది. అవికా అందుబాటులో వుంది. ఇప్పటి పరిస్థితి ఇది. కానీ లెక్కలు మారి అఖిల్ పక్కన మరో హీరోయిన్ ఓకే అయినా ఆశ్చర్యం లేదు.