English | Telugu

మొదలయ్యి రెండేళ్లు అయింది.... ఇంకా ఎన్ని రోజుల!?

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారతదేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ తో ఆర్సీ15 వర్కింగ్ టైటిల్ పై ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి దిల్ రాజు నిర్మాత‌. ఈ చిత్రాన్ని ప్రకటించి రెండేళ్లు అవుతుంది. కానీ ఇప్పటికీ ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు. ఇప్పటికి షూటింగ్ జరుగుతూనే ఉంది. ఇటీవలే గోదావరి తీర ప్రాంతాలలో షూటింగ్ జరిగింది. త్వరలో మరల హైదరాబాద్, రాజమండ్రిలలో షూటింగ్ ఉంటుందని తెలుస్తోంది. పబ్లిక్ ప్లేస్ ల‌లో సన్నివేశాలు చిత్రీకరించడం వల్ల ఆన్ లొకేషన్ పిక్స్, వీడియోస్ లీక్ అవుతున్నాయి. దాంతో అవి నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. రామ్ చరణ్ ఈ సినిమాలో భారీ శక్తివంతమైన రాజకీయ నేతగా కనిపించబోతున్నారు. అభ్యుదయం పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండి సీఎం గా ఎదిగే తీరు చూపించబోతున్నారు.

ఈచిత్రంలో రామ్ చ‌ర‌ణ్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు. యంగ్ రామ్ చరణ్ ఇందులో ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్ గా క‌నిపించ‌నున్నార‌ట‌. ఇంకా ఇందులో శ్రీకాంత్, సునీల్, వెన్నెల కిషోర్, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్నారు. పెద్ద రామ్ చ‌ర‌ణ్ కి జోడీగా అంజ‌లి న‌టిస్తుండ‌గా, యంగ్ రామ్ చ‌ర‌ణ్ కి జోడీగా కియారా అద్వానీ న‌టిస్తోంది. విల‌న్‌గా ఎస్.జె.సూర్య క‌నిపించ‌నున్నారు. శ్రీ‌ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు- శిరీష్ ప్రతిష్టాత్మకంగా సినిమా నిర్మిస్తున్నారు. త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కొన్నాళ్ళు టాలీవుడ్ లో షూటింగులను నిలిపివేశారు. ఇక మ‌రోవైపు శంక‌ర్ ఇండియ‌న్ 2ని వెంట‌నే తీయాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. ఆర్ట్ డైరెక్టర్ మౌనిక రామకృష్ణ, ఆ తరువాత రవీందర్ సినిమా నుంచి వాకౌట్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లోనే శంకర్ మరోవైపు ఇండియన్ 2తో బిజీ అయ్యారు. వీట‌న్నింటి కార‌ణంగా ఈ చిత్రం ఆల‌స్యం అయింద‌ని తెలుస్తోంది. ఇంకా ఈచిత్రం టైటిల్ ను కూడా యూనిట్ ప్ర‌క‌టించ‌లేదు. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే వ‌చ్చే ఏడాది సంక్రాంతి రేసులో ఈచిత్రం ఉండే అవ‌కాశం క‌నిపిస్తోంది.