English | Telugu

మొదట్లో లోకేష్‌ను ఎవరూ పట్టించుకోలేదట!

గత నాలుగైదేళ్లుగా హీరోగా స‌రైన హిట్ లేదు. నిర్మాత‌గా కూడా చేదు అనుభ‌వాలు. భారీ న‌ష్టాలు చ‌విచూశారు. ఆయ‌న ఎవ‌రో కాదు. దేశం గ‌ర్వించ‌ద‌గ్గ విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్. అలాంటి కమలహాసన్ కు నాలుగేళ్ల తర్వాత సాలిడ్ ఇండస్ట్రీ హిట్‌ను అందించిన చిత్రం విక్ర‌మ్. ఈ చిత్రానికి దర్శకుడు లోకేష్ క‌న‌క‌రాజ్. నేడు దేశంలోని దిగ్గ‌జ దర్శకులుగా పేరు తెచ్చుకున్న వారి స‌ర‌స‌న అతి త‌క్కువ చిత్రాల‌తోనే వారికి స‌మాన మైన క్రేజ్‌, ఇమేజ్ తెచ్చుకున్నారు. వారి సరసన మూడు నాలుగు చిత్రాలతోనే అది తక్కువ సమయంలో ఆ స్థాయిలో ఆయన పేరు తెచ్చుకున్నారు. ఈ మూవీతో లోకేష్ కనకరాజు ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయారు. ముఖ్యంగా టాలీవుడ్ హాట్ ఫేవరెట్ డైరెక్టర్‌గా ఈయనను అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే విక్రమ్ విజ‌యం తర్వాత చాలామంది టాలీవుడ్ స్టార్ హీరోలు విక్రమ్ ని పిలిచి ప్రత్యేకంగా ఆహ్వానించి డిన్నర్ కూడా ఇచ్చారని సమాచారం.

ఇక తమ సినిమాలో విక్రమ్ తరహ బ్యాగ్రౌండ్ స్కోరు ఉండాలని డిమాండ్ చేస్తున్న స్టార్ హీరోలు కూడా టాలీవుడ్ లో చాలామంది ఉన్నారని సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి హీరోలు సైతం మ్యూజిక్ డైరెక్టర్ తో అనడం హాట్ టాపిక్ గా మారింది. లోకేష్ కనకరాజు తో సినిమా చేయాలని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఆలోచిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు అందరూ లోకేష్ కనకరాజును కోరుకుంటున్నారు. తెలుగు స్టార్ హీరోలను ఆయన మెప్పించారు. కొంద‌రు నిర్మాత‌లు తనతో సినిమా అంటే విక్రమ్ కి ముందు పెద్దగా పట్టించుకోలేదట. ఈ విషయాన్ని యంగ్ హీరో సందీప్ కిషన్ వెల్లడించాడు. లోకేష్ కనకరాజు దర్శ‌కత్వంలో సందీప్ కిషన్ మా నగరం మూవీని చేశాడు. ఇదే మూవీని తెలుగులోను విడుదల చేశాడు. రెండు భాషల్లోనూ ఈ మూవీ మంచి హిట్ అనిపించింది. అదే సమయంలో లోకేష్ కనకరాజ్ టాలెంట్ గురించి తెలిసి టాలీవుడ్‌లో ఆరుగురు ప్రొడ్యూసర్ల వద్దకు సందీప్ కిషన్ తీసుకెళ్లాడట. సందీప్ తీసుకెళ్లిన ప్రతి నిర్మాత లోకేష్ ను పట్టించుకోలేదట. ఈ స్థాయి డైరెక్టర్ అవుతాడని వారు పెద్దగా ఆసక్తి చూపించలేదట.

ఆరుగురికి ఆరుగురు నిర్మాత‌లు లోకేష్ కనకరాజును రిజెక్ట్ చేయడంతో తను తమిళ్‌లో ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఖైదీ తో ట్రాక్ లోకి వచ్చి విజయ్‌తో మాస్టర్, కమల్ తో విక్రమ్ సినిమాలు చేయడం ద్వారా తన పేరు టాలీవుడ్ లోనూ మారుమోగుతోంది. ఇలా యంగ్ టాలెంట్‌ను నిరాశపరిచిన ఆ ఆరుగురు నిర్మాతలు ఎవర‌నే దానిపై ప్రస్తుతం ఇండ‌స్ట్రీలో చర్చ నడుస్తుంది. ప్రస్తుతం సందీప్ కిషన్ మైకేల్ మూవీ చేస్తున్నాడు. ఇది పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .