English | Telugu

వెరీ ఇంట్రెస్టింగ్‌.. ఓటీటీలో యుద్ధానికి దిగిన ‘వార్‌2’, ‘మిరాయ్‌’!

దసరా కానుకగా విడుదలైన ఓజీ, ఇడ్లీకొట్టు, కాంతార చాప్టర్‌1 చిత్రాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఈ మూడు సినిమాలకు పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. కలెక్షన్లపరంగా చూస్తే కాంతార, ఓజీ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద తమ సత్తా చాటుతున్నాయి. అక్టోబర్‌ 10న మూడు సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. రక్షిత్‌, కోమలి ప్రసాద్‌ జంటగా సాయి మోహన్‌ ఉబ్బన దర్శకత్వంలో రూపొందిన శశివదనే ఫీల్‌ గుడ్‌ మూవీగా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అవకాశం కనిపిస్తోంది. వరుణ్‌ సందేశ్‌ హీరోగా మధులిక వారణాసి హీరోయిన్‌గా ఆర్యన్‌ సుభాన్‌ ఎస్‌.కె. దర్శకత్వంలో రూపొందిన కానిస్టేబుల్‌ కూడా అదే రోజున విడుదల కాబోతోంది. అనసూయ భరద్వాజ్‌, సాయికుమార్‌, వినోద్‌వర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో జయశంకర్‌ దర్శకత్వంలో రూపొందిన అరి ఒక డిఫరెంట్‌ మూవీగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక ఓటీటీలో ఈ వారం విడుదలవుతున్న సినిమాల్లో అందర్నీ ఆకర్షించే సినిమాలు మిరాయ్‌, వార్‌2. సెప్టెంబర్‌ 5న విడుదలైన మిరాయ్‌ నెలరోజుల్లోనే ఓటీటీకి వచ్చేసింది. ఈ రెండు సినిమాల మధ్య పోటీ నెలకొంది. మరి ఈ సినిమాలు ఓటీటీలో ఎలాంటి విజయాన్ని సాధిస్తాయో చూడాలి. ఇంకా ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల గురించి కూడా తెలుసుకుందాం.

నెట్‌ ఫ్లిక్స్‌:
వార్‌ 2 ` అక్టోబర్‌ 9
స్విమ్‌ టు మీ - అక్టోబర్‌ 10
ది విమెన్‌ ఇన్‌ క్యాబిన్‌ 10 - అక్టోబర్‌ 10
కురుక్షేత్ర (యానిమేషన్‌ సిరీస్‌) - అక్టోబర్‌ 10

జియో హాట్‌ స్టార్‌:
మిరాయ్‌ - అక్టోబర్‌ 10
సెర్చ్‌ : ది నైనా మర్డర్‌ కేస్‌ (సిరీస్‌) - అక్టోబర్‌ 10

అమెజాన్‌ ప్రైమ్‌:
మెయింటెనెన్స్‌ రిక్వైర్డ్‌ - అక్టోబర్‌ 10

సన్‌ నెక్స్ట్‌ :
త్రిబాణధారి బార్బరిక్‌ - అక్టోబర్‌ 10

జీ 5:
స్థల్‌ - అక్టోబర్‌ 10