English | Telugu

పెద్ద సమస్య వచ్చిందే.. బిజినెస్‌పరంగా నాలుగో స్థానంలో ‘లైలా’!

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న యంగ్‌ హీరోస్‌లో విశ్వక్‌సేన్‌ది ఒక డిఫరెంట్‌ ఇమేజ్‌ అని చెప్పొచ్చు. అతను ఎంపిక చేసుకునే కథాంశాలు, చేసే ఎక్స్‌పెరిమెంట్స్‌, మాస్‌లో అతనికి ఉన్న ఇమేజ్‌.. ఇవన్నీ అతన్ని ఒక విలక్షణ హీరోగా నిలబెట్టాయి. ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చెయ్యడమే లక్ష్యంగా సినిమాలు చేసే విశ్వక్‌ తనకంటూ ప్రత్యేకమైన అభిమాన గణాన్ని ఏర్పరుచుకున్నారు. తాజాగా ‘లైలా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్‌ డే సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్‌ ఫస్ట్‌ టైమ్‌ ఒక లేడీ గెటప్‌లో కనిపించబోతున్నారు. దీంతో సినిమాకి మంచి హైప్‌ వచ్చింది.

ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో దొర్లిన చిన్న పొరపాటు వల్ల సినిమాపై కొంత వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవమే అయినా దాని వల్ల సినిమాకి ఎలాంటి నష్టం జరగదు అనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. సినిమాలో కంటెంట్‌ ఉంటే దాని విజయాన్ని ఎవరూ ఆపలేరు అనేది సత్యం. అది ‘లైలా’ విషయంలో నిజమవుతుందని ట్రేడ్‌వర్గాలు చెబుతున్నాయి. సినిమా సినిమాకీ తన బిజినెస్‌ రేంజ్‌ని పెంచుకుంటూ వెళ్తున్నాడన్న సుస్పష్టం. అయితే దానికి భిన్నంగా ‘లైలా’ చిత్రం అతని టాప్‌ సినిమాల్లో బిజినెస్‌పరంగా నాలుగో స్థానంలో నిలిచింది. అతని కెరీర్‌లో హయ్యస్ట్‌ బిజినెస్‌ జరిగిన సినిమా గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి. ఈ సినిమా రూ.10.30 కోట్ల బిజినెస్‌ చేసింది. ఆ తర్వాతి స్థానంలో గామి చిత్రం నిలుస్తుంది. దీనికి రూ.10.20 కోట్ల బిజినెస్‌ జరిగింది. ఈ రెండు సినిమాలు నిర్మాతలకు మంచి లాభాల్ని తెచ్చిపెట్టాయి. ఆ తర్వాతి స్థానంలో మెకానిక్‌ రాకీ నిలుస్తుంది. ఈ సినిమా రూ.8.50 కోట్ల బిజినెస్‌ చేసింది.

ప్రస్తుతం రిలీజ్‌కి సిద్ధమైన ‘లైలా’ చిత్రం రూ.8.20 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌తో నాలుగో స్థానంలో ఉంది. బ్రేక్‌ ఈవెన్‌ సాధించాలంటే రూ.9 కోట్ల షేర్‌ను కలెక్ట్‌ చెయ్యాల్సి ఉంటుంది. ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్‌కి వస్తున్న రెస్పాన్స్‌ చూస్తుంటే ‘లైలా’ సునాయాసంగా తన టార్గెట్‌ని రీచ్‌ అవుతుంది అంటున్నారు. అయితే ప్రతి సినిమాకీ తన బిజినెస్‌ని పెంచుకుంటూ వెళ్తున్న విశ్వక్‌ ‘లైలా’ చిత్రం బిజినెస్‌ విషయంలో నాలుగో స్థానంలో ఉండడం అందర్నీ కలవరపెడుతోంది. అతని కెరీర్‌ గ్రాఫ్‌ని పరిశీలిస్తే.. తన గత చిత్రం గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి బిజినెస్‌ రూ.10.30 కోట్లు చేసింది. దాని ప్రకారం చూస్తే దాన్ని మించిన బిజినెస్‌ ‘లైలా’ చెయ్యాల్సి ఉంది. కానీ, దానికంటే దాదాపు రెండు కోట్లు తక్కువ బిజినెస్‌ జరిగింది. దానికి కారణం ఏమిటి అనేది ఎవరికీ అంతుబట్టడం లేదు. మరి రిలీజ్‌ తర్వాత ఈ సినిమా ఎలాంటి టాక్‌ తెచ్చుకుంటుందో, కమర్షియల్‌గా ఎంతటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.