English | Telugu
విష్ణుప్రియ ఒక్కో వీడియోకి ఎంత తీసుకుంటుందో తెలుసా!
Updated : Mar 20, 2025
సోషల్ మీడియాలో ప్రసారమయ్యే బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేసిందుకుగాను హైదరాబాద్ పోలీసులు పలు సినీ,టీవి,యూట్యూబర్ లపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.విజయ్ దేవరకొండ(Vijay devarakonda)రానా(Rana)నిధి అగర్వాల్,ప్రకాష్ రాజ్,మంచులక్ష్మి, ప్రణీత,శ్రీముఖి,రీతూ చౌదరి,యాంకర్ శ్యామల,నీతూ అగర్వాల్,వర్షిణి,అనన్య నాగళ్ళ,విష్ణుప్రియ,సిరి హనుమంతు,వంశీ సౌందర్య రాజన్,వసంత కృష్ణ,శోభాశెట్టి, అమృత చౌదరి,నాయిని పావని,నేహా పతాన్ ,పాండు,పద్మావతి ,ఇమ్రాన్ ఖాన్,సాయి,భయ్యాసన్నీ,టేస్టీ తేజ,బండారుశేషసుకృతి వంటి వారు కేసులు నమోదైన లిస్ట్ లో ఉన్నారు.
రీసెంట్ గా పంజాగుట్ట పోలీసులు విష్ణుప్రియ(Vishnu Priya)ని విచారించగా ఆమె పోలీసులతో మొత్తం 15 బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేసానని,ఒక్కో వీడియోకి 90 వేలు తీసుకున్నానని చెప్పడం జరిగింది.బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి పలు కీలక విషయాలని కూడా విష్ణు ప్రియ చెప్పడంతో స్టేట్‌మెంట్ ని పోలీసులు రికార్డు చేసారు.ఆమె ఫోన్ ని కూడా పోలీసులు సీజ్ చెయ్యడం జరిగింది.