English | Telugu

పాకిస్థాన్ వల్ల నా ఊరు తగలపడింది..స్టార్ రైటర్ జావేద్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు 

భారతీయ చిత్ర పరిశ్రమలో రచయితకి స్టార్ డమ్ తెచ్చిన వాళ్ళల్లో 'జావేద్ అక్తర్'(javed Akhtar)కూడా ఒకరు. మరో స్టార్ రైటర్ సలీంతో కలిసి సలీం-జావేద్(saleem- Javed)పేరుతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలని ప్రేక్షకులకి అందించాడు. సోలో రైటర్ గా కూడా చరిత్ర సృష్టించిన సినిమాలకి రూపకల్పన చేసాడు. జంజీర్, అందాజ్, షోలే, దీవార్, డాన్, శక్తి, మిస్టర్ ఇండియా, సాగర్, అర్జున్, డెకాయిట్, ఖేల్, రూప్ కి రాణి చోరంకా రాజా వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. గేయ రచయితగా కొన్ని వందల పాటలకి సాహిత్యాన్ని అందిస్తు వస్తున్న జావేద్, షారుఖ్ గత చిత్రం డంకీ లో కూడా అద్భుతమైన సాంగ్ రాసారు

రీసెంట్ గా జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతు 'పహల్ గామ్(Pahal Gam)దాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉంది. అమాయకుల్ని అన్యాయంగా కాల్చి చంపారు. ఈ విషయాన్నీ మనం మర్చిపోకూడదు. ఒకసారి నేను పాకిస్థాన్ లోని లాహోర్ లో జరిగిన ఫిలిం ఫెస్టివల్ కి హాజరయ్యాను. ఒక విలేకరి నాతో మీ భారతీయులంతా పాకిస్థాన్ ని ఉగ్రవాదులని అనుకుంటున్నారా అనే ప్రశ్న వేసాడు. అప్పుడు నేను అతనితో నేను ముంబై వాసిని, నా నగరంపై ఎన్నోసార్లు దాడి జరిగి నా కళ్ల ముందే తగలబడింది. ఈజిప్టు, స్వీడన్ నుంచి వచ్చిన వాళ్లు ఆ విధంగా చెయ్యలేదు. పాకిస్థాన్ కి చెందిన వాళ్లే చేసారు. ఇప్పటికి వాళ్ళు పాకిస్థాన్ లో ప్రశాంతంగా తిరుగుతున్నారని చెప్పాను. నేను ఇండియాకి వచ్చాక నా మాటల విషయం తెలిసి పాకిస్థాన్ లో గొడవలు జరిగాయి.

శత్రువులు ముంబైని మళ్ళీ టార్గెట్ చేసే అవకాశం ఉంది. మన దేశంలో ఏ ప్రభుత్వమైనా శాంతి కోసమే ప్రయత్నిస్తుంది. కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు వాళ్ళ దేశస్థుల మృతదేహాల్ని పాకిస్థాన్ చిన్నచూపు చూసింది. అలాంటి వారితో స్నేహంగా ఎలా ఉండాలి. తొంబై తొమ్మిది శాతం మంది కాశ్మీరీలు భారతదేశానికి విధేయులని చెప్పుకొచ్చాడు. జావేద్ అక్తర్ ఐదు సార్లు జాతీయ అవార్డులతో పాటు పద్మశ్రీ, పద్మ భూషణ్ పురస్కారాలని అందుకున్నాడు.


ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.