English | Telugu
విజయేంద్రప్రసాద్ డైరెక్షన్లో కార్తీ సినిమా..!
Updated : Apr 20, 2016
ఊపిరి సినిమాతో తెలుగులో తన మార్కెట్ కు మళ్లీ వైభవాన్ని తెచ్చుకున్నాడు కార్తీ. అమాయకత్వం, అల్లరి కలగలిపిన ఆ పాత్రతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. తమిళ యంగ్ హీరోలందరిలోనూ, ఇప్పుడు కార్తీ మార్కెట్ మంచి రేంజ్ కు చేరుకుందనేది ఎవరూ కాదనలేని విషయం. అందుకే ఇప్పుడు రెండు భాషల్లోనూ సినిమాలు చేస్తూ, వాటిని ద్విభాషా చిత్రాలుగా రిలీజ్ చేయాలనుకుంటున్నాడు. ఇప్పటికే కాష్మోరా పేరుతో హర్రర్ మూవీ, మణిరత్నం డైరెక్షన్లో ఒక లవ్ స్టోరీ చేయాల్సి ఉండగా, ఆ తర్వాత రాజమౌళి తండ్రి, రైటర్ విజయేంద్రప్రసాద్ డైరెక్షన్లో మూవీ చేయడానికి సిద్ధమౌతున్నాడట. ఇప్పటికే కథా చర్చలు కూడా జరిగిపోయాయంటున్నారు. రైటర్ గా ఇండస్ట్రీలో చాలా సినిమాలకు పనిచేసిన విజయేంద్రప్రసాద్ కు డైరెక్షన్ పై మక్కువ ఎక్కువ. 2006 లో శ్రీకృష్ణ 2006 సినిమాతో యావరేజ్ విజయాన్ని దక్కించుకున్న ఆయన, రాజన్న సినిమాతో విమర్శకుల మెప్పును కూడా పొందారు. ప్రస్తుతం తెలుగు తమిళ కన్నడ భాషల్లో త్రిభాషా చిత్రంగా వల్లి అనే సైకలాజికల్ థ్రిల్లర్ ను తెరకెక్కించారు. వచ్చే నెలలోనే విడుదల కాబోతున్న ఈ సినిమా తర్వాత కార్తీ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. బాలీవుడ్ లో సన్నీ డియోల్ తో మేరా భారత్ మహాన్ అనే సినిమాను కూడా తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు విజయేంద్రప్రసాద్. ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ గా రాజమౌళి వ్యవహరించనుండటం విశేషం.