English | Telugu
అమరావతి కోసం కేసీఆర్ ను కలిసిన బాలయ్య..!
Updated : Apr 20, 2016
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బాలయ్య వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి. ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు బాలయ్య. ఇప్పటికే తన సినిమాల దర్శకులందరూ వస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరో వైపు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా, మూవీ ఓపెనింగ్ కు పిలుస్తున్నారు. బుధవారం నాడు స్వయంగా వెళ్లి, ముహూర్తపు సన్నివేశానికి హాజరు కావాలంటూ కేసీఆర్ కు ఆహ్వాన పత్రిక ఇచ్చారు బాలకృష్ణ. కేసీఆర్ క్యాంప్ కార్యాలయంలో ఆయన్ను కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనున్న ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సిందిగా ఆయనను కోరారు. అమరావతి చరిత్ర, శాతవాహనుల పరిపాలనా కాలం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 22 న పూజా కార్యక్రమాలు నిర్వహించి షూటింగ్ ప్రారంభించబోతున్నారు.