English | Telugu
వర్మ సర్కార్ కు సీక్వెల్ తీస్తాడట..!
Updated : Apr 20, 2016
రాంగోపాల్ వర్మ బాలీవుడ్ కెరీర్లో, రంగీలా తర్వాత అంత మంచి బూస్ట్ ఇచ్చిన సినిమాలు సర్కార్, సర్కార్ రాజ్. 2005 లో సర్కార్ రిలీజై భారీ హిట్ కొడితే, 2008లో సర్కార్ రాజ్ హిట్టయింది. వయసైపోయిన అమితాబ్ ను మళ్లీ యాంగ్రీ రోల్ లో చూస్తామని అభిమానులు అనుకోలేదు. కానీ వర్మ వారికి మళ్లీ పాత అమితాబ్ ను గుర్తు చేశాడు. రీసెంట్ గా తాను ఓపెన్ చేసిన కంపెనీ ఆఫీస్ కు బిగ్ బి వచ్చి చూసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా, ఇద్దరూ సర్కార్ కు మరో సీక్వెల్ తీస్తే ఎలా ఉంటుందన్న దానిపై చర్చించారట. ఇద్దరికీ ఆ ఊహ నచ్చడంతో, త్వరలోనే సర్కార్ 3 తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారని బాలీవుడ్ వర్గాలంటున్నాయి. బిగ్ బీ తో మళ్లీ పని చేయడం తనకు చాలా ఎగ్జైంటింగ్ గా ఉందని, తన బాలీవుడ్ కమ్ బ్యాక్ అద్భుతంగా ఉంటుందని భావిస్తున్నానని వర్మ డైరెక్ట్ గా ప్రకటించేశాడు కూడా. బిగ్ బి ఉన్నప్పటికీ, సర్కార్ 3 లో అభిషేక్, ఐశ్వర్య మాత్రం ఉండరట. క్యాస్టింగ్ ను త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశం ఉంది. మొత్తానికి వర్మ బాలీవుడ్ లో పెద్ద చేపనే పట్టేశాడన్నమాట. మరి రీఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి.