English | Telugu
హీరోగా వస్తున్న విజయ నిర్మల మనవడు
Updated : Oct 25, 2020
అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కిన తెలుగు నటి విజయ నిర్మల. కథానాయికగా, తరువాత నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా ఎన్నో చిత్రాలు చేశారు. ఆమె కుమారుడు నరేష్ హీరోగా విజయవంతమైన సినిమాల్లో నటించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు. విజయనిర్మల మనవడు, నరేష్ కుమారుడు నవీన్ విజయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు విజయ నిర్మల కుటుంబం నుండి మరో హీరో వస్తున్నాడు.
విజయ నిర్మల మనవడు శరణ్ త్వరలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మహేష్ బాబు, నరేష్ అండదండలతో యాక్టింగ్, ఫైటింగ్, హార్స్ రైడింగ్ వంటి అంశాల్లో అతడు ట్రయినింగ్ తీసుకున్నాడని తెలిసింది. రామ్ చంద్ర వట్టికూటి దర్శకత్వంలో రొమాంటిక్ డ్రామాతో శరణ్ హీరోగా పరిచయం కానున్నాడు. విజయదశమి ఘడియల్లో ఈ సినిమా ప్రారంభం కానుంది. దీనికి శ్రీలత బి. వెంకట్ నిర్మాత.