English | Telugu

విజ‌య్ సేతుప‌తి జోడీగా బ్యూటీ క్వీన్‌!

భారీ సినిమాల నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ ఈ ఏడాది మార్చిలో చేసిన అనౌన్స్‌మెంట్ విజ‌య్ సేతుప‌తి ఫ్యాన్స్‌ను, సినిమా ప్రియుల్నీ ఆనందంలో ముంచెత్తింది. తాము సేతుప‌తితో సినిమా తియ్య‌బోతున్నామ‌ని ప్ర‌క‌టించిన ఆ సంస్థ, ఆ సినిమాకు తాత్కాలికంగా VJS 46 అనే పేరు పెట్టింది. శివ‌కార్తికేయ‌న్‌తో క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్స్ తీసిన పొన్‌రామ్ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. ఈ సినిమాలో సేతుప‌తి పోలీస్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపిస్తాడ‌న్న‌ట్లు అప్ప‌టి అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌లో చూపించారు.

డి. ఇమ్మాన్ సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ మూవీలో 'కుక్ విత్ కోమ‌లి' ఫేమ్ క‌మెడియ‌న్ పుగ‌ళ్ తొలిసారి విజ‌య్ సేతుప‌తితో క‌లిసి న‌టించ‌బోతున్నాడు. ఆ ఇద్ద‌రి ఫొటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేశాయి.

లేటెస్ట్‌గా నిర్మాత‌లు ఈ సినిమాలో హీరోయిన్ ఎవ‌ర‌నే విష‌యం సోష‌ల్ మీడియా హ్యాండిల్ ద్వారా ప్ర‌క‌టించారు. సేతుప‌తితో మిస్ ఇండియా 2018 అనుకీర్తి వాస్ రొమాన్స్ చేయ‌నున్న‌ది. ఈ సినిమాతో పాటు ఆమె బిగ్ బాస్ ఫేమ్ ముగేన్ రావ్ 'వెట్రి' మూవీలోనూ క‌నిపించ‌నున్న‌ది.