English | Telugu

'పుష్ప' నుంచి బిగ్ అప్డేట్.. రేపే ఆ సర్ప్రైజ్!

అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప'. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ నుండి బుధవారం ఓ సర్ప్రైజ్ రానుంది.

'పుష్ప' మూవీ నుండి రష్మిక ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. రేపు(బుధవారం) ఉదయం 9.45 గంటలకు ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తున్నట్లు తెలియజేస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ సినిమాలో రష్మిక గిరిజన యువతిగా కనిపించనుందనే టాక్ వచ్చింది. మరి రష్మిక ఎలా ఉంటుందో చూడాలి.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న పుష్ప మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగాన్ని ఈ ఏడాది చివరిలో క్రిస్మస్ కి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.