English | Telugu

మెగా కోరికను మెగా మేనల్లుడు తీరుస్తాడా?

అక్టోబర్ 18 మెగా అభిమానులకు పండుగ రోజు కాబోతోంది. మెగా అభిమానుల కోరికను మెగా మేనల్లుడు సాయిధర్మతేజ ఈ రోజున తీర్చబోతున్నాడు. గత కొన్ని నెలలుగా మెగా ఫ్యామిలీని మొత్తం ఓకే వేదికపై చూడాలని అనుకుంటున్న అభిమానుల కోరిక తీరడంలేదు. కానీ ఈ సారి దానిని మెగా మేనల్లుడు తప్పక తీరుస్తాడని అనుకు౦టున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయిధర్మతేజ తొలి సినిమా లంచ్ లో చిరుతో కలిసి మెరిశాడు. ఆ తరువాత ఏ మెగా ఫంక్షన్ కి ఆయన హాజరుకాలేదు. రీసెంట్ గా జరిగిన రామ్ చరణ్ గోవిందుడు ఆడియోకి మెగా ఫ్యామిలీ మొత్తం కలిసి వచ్చిన పవన్ లేకపోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది. అందుకే ఈసారి అక్టోబర్ 18 జరగబోయే సాయిధర్మతేజ 'పిల్లా నువ్వు లేని జీవితం' ఆడియో ఫంక్షన్ కి మెగా ఫ్యామిలీతో పాటు పవన్ కూడా హాజరుకానున్నట్టు సమాచారం. చాలా రోజులు తరువాత చిరు, నాగబాబు, పవన్ ఓకే వేదికపైకి రానునున్నడంతో మెగా అభిమానులు ఏంతో ఆత్రుతగా ఈ ఫంక్షన్ కోసం ఎదురుచూస్తున్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.